కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య సూపర్ దూపర్ సినిమాలు చేస్తూ వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో తీసిన జగమే తంత్రం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దాదాపు ఈ సినిమా 190 దేశాల్లో విడుదలైంది. అలానే నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి తగ్గట్టుగానే ఆ చిత్రయూనిట్ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. అందుకే నిన్న మధ్యాహ్నం నుంచి ధనుష్ ఫ్యాన్స్ జగమే తంత్రం సినిమాని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.ఇక ఈ సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా కూడా ధనుష్ హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు.సోషల్ మీడియాలో జగమేతంత్రం హవా గట్టిగానే కొనసాగింది.ఇక కథ విషయానికి వస్తే ఇది సాధారణ కథ. ఇది ఇంతకు ముందే ఎన్నో సార్లు చూసిన చిత్రంగా అనిపిస్తుంటుంది.

ఇక తమిళ శరణార్థుల కోసం లండన్‌లో పోరాడే ఓ గ్యాంగ్ స్టర్ కథగా జగమే తంత్రాన్ని తెరకెక్కించారు.ఇక ఇందులో కథ పర్వాలేదనిపించినా కూడా కథనం అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ హీరోయిజం చుట్టూనే కథను అల్లాడనే కామెంట్లు కూడా వచ్చాయి.ఇక ఓటీటీలో వస్తున్న మూవీలన్నీ కూడా నిరాశ పరుచుతుండటంతో సినీ ప్రేమికులు నిరాశపడుతున్నారు. కాని ఈ జగమే తంత్రం ఎలా ఉన్నా కూడా అభిమానులను మాత్రం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నట్టుంది. ఇక మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం జగమే తంత్రం హవా బాగా కొనసాగుతోంది. తన సూపర్ మాస్ హీరోయిజాన్ని తన స్టైల్లో చూపించడంతో ధనుష్ మరోసారి నిరూపించుకున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ధనుష్ జగమే తంత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనే టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే నెట్ ఫ్లిక్స్‌లో జగమే తంత్రం వ్యూస్ పరంగా ఖచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: