సినీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. తెలంగాణ లో మళ్ళీ థియేటర్లు జనాలతో కళకళలాడనున్నాయి.దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణా లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ మేరకు ఆదివారం అనగా జూన్ 20 నుంచి సినిమా థియేటర్లకు అనుమతులు ఇచ్చింది తెలంగాణా సర్కారు.ఇక రేపటి నుండి 100 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడిపించుకోవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ థియేటర్ యాజమాన్యం తో పాటుగా సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఇక రేపటి నుండి మళ్ళీ థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.

ఇక ఇప్పటికే లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్లు, సినిమా హాళ్లు అన్ని బంద్ అయిన విషయం తెలిసిందే.దీనివల్ల సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది.ఇక తాజాగా మళ్ళీ ఇండ్రస్టీ కి పూర్వ వైభవం రానుంది.ఇక కరోనా వల్ల చిన్నా, పెద్ద సినిమాలన్నీ కూడా ఓటీటీ ల బాట పడుతున్నాయి.కానీ ఇప్పటి నుంచి థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతోంది.ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి విడుదల కావాల్సిన సినిమాలు చాలా వరకు వాయిదా పడ్డాయి.ఇక లాక్ డౌన్ కి ముందు అదే ఏప్రిల్ నెలలో చివరిగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలైంది.

ఇక ఆ తర్వాత థియేటర్లు క్లోజ్ అవ్వడంతో విడుదల కావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి.అదే లిస్ట్ లో ముందుగా అక్కినేని హీరో నాగ చైతన్య 'లవ్ స్టోరీ',న్యాచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్,దగ్గుబాటి రానా 'విరాట పర్వం', మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య',విక్టరీ వెంకటేష్ 'నారప్ప',రవితేజ 'ఖిలాడి',బాలయ్య 'అఖండ',విశ్వక్ సేన్ 'పాగల్' తో పాటుగా మరికొన్ని చిన్నా చితకా సినిమాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమాలతో సినీ లవర్స్ మళ్ళీ పండగ చేసుకోనున్నారు. ఇక ఈ సినిమా ఫలితాల మీద కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుల రిలీజ్ డేట్ లు ఆధారపడి ఉన్నాయి. మళ్ళీ ఒకప్పటిలా జనాలు సినిమా చూడటానికి థియేటర్లకు రాగలిగితే.. సినిమా కలెక్షన్స్ కూడా బాగుంటే.. అప్పుడు పాన్ ఇండియా సినిమాలు కూడా తమ రిలీజ్ ని ఖరారు చేసుకోనున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: