మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశి ఖన్నా కలిసి నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ తొలిప్రేమ. తన బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ మూవీ టైటిల్ ని తన సినిమాకు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో వెల్లడించిన హీరో వరుణ్ తేజ్, ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

వాస్తవానికి మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకుంది. తొలిసారిగా ట్రైన్ లో కలుసుకుని తొలిచూపులోనే ప్రేమలో పడ్డ ఇద్దరు ఇద్దరు ప్రేమికులు ఆ తరువాత కాలేజీలో కలుసుకుని పూర్తిగా ప్రేమలో మునిగిపోతారు. అయితే ఆ తరువాత వారిద్దరి మధ్య వచ్చిన కొద్దిపాటి విబేధాల వలన విడిపోవడం అనంతరం కొన్ని సంఘటనల తరువాత కలుసుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో అద్భుతంగా తీశారు.

ఇక ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్ పెద్ద హైలైట్ అనే చెప్పాలి. స్క్రీన్ పై వరుణ్, రాశి ల జోడీ అదిరిపోయిందంటూ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా వరుణ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిల్చిందని చెప్పవచ్చు. మ్యూజిక్, రొమాంటిక్, యక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్, ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నటుడిగా వరుణ్ ఈ సినిమాలో తన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ నుండి మరింత పేరు దక్కించుకున్నారు. మొత్తంగా బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మాదిరిగా అబ్బాయి వరుణ్ తేజ్ తొలిప్రేమ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంది .... !!    

మరింత సమాచారం తెలుసుకోండి: