ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు ఏదైనా దైర్యంగా తండ్రితో చెప్తున్నారు. తండ్రి ని ఒక ఫ్రెండ్ లాగా భావిస్తున్నారు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని అనుకుంటారు. తాను జీవితం లో చెయ్యలేనివి కొన్ని కొడుకులు చేస్తె చూసి మురిసిపోతున్నాడు. తన పేరును, తన కుటుంబ గౌరవాన్ని తన కొడుకు మరింత పెంచాలని అనుకుంటారు. అప్పుడే తాను గర్వంగా ఫీల్ అవ్వాలని భావిస్తారు. అలా తన తండ్రి పేరును పెంచి, సంతోషాన్ని పంచుకొవడానికి ఓ ముఖ్యమైన రోజు ఫాధర్స్ డే..


తండ్రి పేరును నిలబెట్టిన సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు.. అలాంటి వాళ్ళల్లో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు.. కృష్ణ వారసుడి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ప్రిన్స్.. మొదటి సినిమా తో మంచి పేరును సంపాదించుకున్నాడు.. అలా ఒక్కో సినిమాలో తన పేరును పెంచుకున్న మహేష్ బాబు తండ్రి స్థానాన్ని అందుకొని సూపర్ స్టార్ గా పేరు తెచుకున్నాడు.. బాల నటుడిగా పరిచయమైన అతను ఇప్పుడు అగ్ర హీరో అయ్యాడు. తన తండ్రితో కలిసి 10 సినిమాల్లో కలిసి చేశారు.

 

హీరో అయ్యాక తండ్రి తో క‌లిసి మూడు మూవీల్లో చేశారు. వీరిద్దరు కలిసి నటించిన  నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి తన తండ్రితో క‌లిసి కోడి రామకృష్ణ డైరెక్ష‌న్‌ లో చేసిన పోరాటంలో న‌టించారు. ఈ సినిమా రికార్దులను బ్రేక్ చేసింది.కొడుకు దిద్దిన కాపురం ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలొ నటించి ప్రశంసలు అందుకున్నారు.మరెన్నో సినిమాల లో నటించి స్టార్ హీరో అయ్యాడు. ఇకపోతే ఇప్పుడు చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి.. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: