బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన అదా శర్మ నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాలో నటించింది. ఆ సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన అమ్మడు ఆ తర్వాత తన రేంజ్ పెంచుకోలేకపోయింది. సినిమాలైతే చేస్తుంది కాని చిన్నా చితకా వేషాలు వేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది. ఏవో ఒకటి రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినా అవి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. ప్రస్తుతం అదా శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో అమ్మడు తెగ హల్ చల్ చేస్తుంది.

ఓ విధంగా చెప్పాలంటే ఆడియెన్స్ తనని మర్చిపోకుండా అదా శర్మ అలా చేస్తుందని చెప్పొచ్చు. తెలుగులో నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ సినిమాలో అదా శర్మ ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉంటారని చెబుతున్నారు. నివేదా థామస్, కాజల్, రీతు వర్మతో పాటుగా అదా శర్మ కూడా మీట్ క్యూట్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే ఈ సినిమాతో పాటుగా అమేజాన్ ప్రైం లో ఓ వెబ్ సీరీస్ కు ఆమెని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య హీరోయిన్స్ అంతా కూడా వెబ్ సీరీస్ ల మీద పడ్డారు.

సినిమాలతో కూడా వెబ్ సీరీస్ లకు ప్రేక్షకాదరణ లభించడంతో వెబ్ సీరీస్ ల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదా శర్మతో ఓ బోల్డ్ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట అమేజాన్ ప్రైం నిర్వాహకులు. ఈ వెబ్ సీరీస్ తో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తుంది అదా శర్మ. ఇన్నాళ్లు సోషల్ మీడియాలోనే రెచ్చిపోయిన అదా శర్మ ఈ వెబ్ సీరీస్ లో తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఈ వెబ్ సీరీస్ తో అదా శర్మ చాలా పెద్ద స్కెచ్చే వేసిందని అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: