బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్ చేసిన పాత్ర అందరికి గుర్తుండి ఉంటుంది. అందులో హీరో సిద్ధార్థ్ ప్రకాశ్ రాజ్ కొడుకుగా నటించాడు. చిన్నప్పటి నుండి కొడుక్కి ఏం కావాలన్నా సరే తండ్రి దగ్గర ఉండి చూసుకుంటాడు. అది తన బాధ్యతగా ఫీల్ అవుతాడు. బాధ్యత వరకు ఓకే కాని కొడుకు ఇష్టాఅయిష్టాలను పట్టించుకోకుండా అంతా తన ఇష్ట ప్రకారంగానే జరగాలని కోరుకునే ఫాదర్. అందుకే బొమ్మరిల్లు ఫాదర్ కు అంత ప్రత్యేకత వచ్చింది. కొడుకు వేసుకునే షర్ట్ దగ్గర నుండి ఏం తాగాలి.. ఏం తినాలి అన్నది కూడా ఆ తండ్రి డిసైడ్ చేస్తాడు.

రియల్ లైఫ్ లో ఇలాంటి తండ్రులు ఉంటారా అని డౌట్ పడొచ్చు. మరీ తినేది తాగేది తన ఇష్ట ప్రకారంగా ఉండాలనుకునే ఫాదర్లు ఉండరు కాని నిజ జీవితంలో కూడా బొమ్మరిల్లు ఫాదర్లు ఉన్నారు.. ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టం తెలిసిన మనుషులు తమ పిల్లలు ఆ కష్టం పడకూడదు అనే భావనతో ఎక్కడ కొడుకు తప్పుచేస్తాడో అన్న ఆలోచనతో వారిని సరిదిద్దే క్రమంలో బొమ్మరిల్లు ఫాదర్ లాంటి ఫాదర్లు ఏర్పడుతుంటారు. తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తాడని వెనుక సపోర్ట్ ఉండటం వరకు బాగానే ఉంటుంది. కాని కొడుక్కి ఒక వయసు వచ్చాక కూడా తండ్రి చెప్పినట్టు వినాలని అనుకోవడం గురించి ఏమంటారో అర్ధం చేసుకోవాలి.

తండ్రికి కొడుకు.. కొడుక్కి తండ్రి ఓ బాధ్యత. పొరపాట్లు చేస్తే అసలు ఏది మంచి ఏది చెడు అన్న అసలైన మేలు కొలుపు ఏర్పడుతుంది. కాని తన కొడుకు అసలు తప్పే చేయకూడదు.. తప్పుడు మార్గం లో ఆలోచించకూడదు అన్న విధంగా బొమ్మర్ల్లి ఫాదర్ ల ట్రీట్ మెంట్ ఉంది. మనిషిని కంట్రోల్ చేయగలం కాని మనసుని చేయలేం కదా. అయినా సరే బొమ్మరిల్లు ఫాదర్లు తమ స్వార్ధం కోసం అలా ఏమి చేయరు. కొడుకు వృద్ధి లోకి రావడం కోసం వారి ప్రతి ఆలోచనని కొడుకు మీద ఉంచుతారు. కొడుకు ఎక్కడ పొరపాట్లు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అని వారి ఆందోళన. వాటి వల్లే వారికి కొడుకు మీద ఆ బాధ్యత. ఆ సినిమాలో క్లైమాక్స్ లో చూపించినట్టుగా కొడుకులు కూడా తండ్రి చూపించే ఆ బాధ్యతని అర్ధం చేసుకుంటే జీవితంలో తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిని తప్పు ఒప్పులని సరిచేసేందుకు తండ్రి అనే వాడు తన వెనక ఉంటాడు కనుక. అందుకే అంటారు తండ్రి అంటే కొడుక్కి బాధ్యత.. కొడుకు అంటే తండ్రికి బాధ్యత అని.


మరింత సమాచారం తెలుసుకోండి: