ఎవరు ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తి వేయడంతో ఒకేసారి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. అవసరం అనుకుంటే వెంటనే ధియేటర్లు తెరుచుకోమని ప్రభుత్వం సూచనలు ఇవ్వడంతో ఊహించని ఈ పరిణామానికి ప్రస్తుతం ఫలిం ఇండస్ట్రీ వర్గాలు పరుగులు తీస్తున్నాయి.


మొదట్లో జూలై మొదటి వారం నుండి ధియేటర్లు తెరుచుకుంటాయి అని అనుకున్నారు. అయితే ఇంకా ఈ నెలలో 10 రోజులు మిగిలి ఉండగానే ధియేటర్లు తెరుచుకొబోతున్నాయి. అయితే ప్రదర్శించ దానికి కొత్త సినిమాలు లేకుండా ఖాళీ ధియేటర్లలో ఏమి చేయాలి అని ఇండస్ట్రీ వర్గాలు అతర్మధనంలో ఉన్నట్లు టాక్. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయలేదు. సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది.


ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రా ప్రాంతంలో ధియేటర్లు తెరుచుకోకుండా ఒక్క తెలంగాణాలో ధియేటర్లు తెరుచుకుంటే ఏమి ప్రయోజనం అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఈవిధంగా ఉంటే ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న చిన్న సినిమాల సంఖ్య 30కి పైగా ఉన్నాయి అంటున్నారు. దీనితో ధియేటర్లు తెరుచుకోగానే వారానికి 4 సినిమాలకు పైగా విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


పరిస్థితులు ఇలా ఉంటే భారీ సినిమాల పరిస్థితి మరీ అయోమయంగా ఉంది అన్న మాటలు వస్తున్నాయి. ‘అఖండ’ ‘ఆచార్య’ ‘రాథే శ్యామ్’ ‘కిలాడీ’ సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా దసరా కు రెడీ అవుతున్నాయి. ఇక మధ్యలో వచ్చే ఆగష్టు 15కు ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ ‘విరాటపర్వం’ సినిమాలతో పాటు ఇంకా చాల మీడియం రేంజ్ సినిమాలు దసరా లోపు తమ అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ధియేటర్లు తెరుచుకున్నా ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంటుందని చాలామంది నిర్మాతలు నష్టబోయే పరిస్థితులు ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ధియేటర్లు తెరుచుకున్న ఆనందం ఎక్కువకాలం నిలబడదా అన్న ఆలోచనలు కూడ వస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: