కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ డైరక్షన్ లో దళపతి విజయ్ హీరోగా వచ్చిన సినిమా తుపాకి. ఈ సినిమ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. విజయ్ మార్క్ మాస్ ఎలిమినెట్స్ తో పాటుగా మురుగదాస్ డైరక్షన్ టాలెంట్ తో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తో సర్కార్ సినిమా చేశాడు మురుగదాస్. ఇదిలాఉంటే మురుగదాస్ డైరక్షన్ లో తుపాకి సీక్వల్ ఉంటుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. తుపాకి సీక్వల్ ఉంటుందట కాని హీరో మారం విజయ్ కాదని అంటున్నారు.

తుపాకి 2లో విజయ్ కి బదులుగా కమల్ హాసన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తుపాకి 2కి రెడీ అవుతాడని తెలుస్తుంది. తుపాకి సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ కు తెలుగులో మొదటి హిట్ అందించిన సినిమా తుపాకి. ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ ను కమల్ హాసన్ తో చేస్తుండటం విశేషం.

తుపాకి పార్ట్ 2 కథ తుపాకికి ఏమాత్రం సంబంధం లేని కథతో వస్తుందని అంటున్నారు. అందుకే హీరోని మార్చేసినట్టు చెబుతున్నారు. అయితే కోలీవుడ్ ఇన్నర్ టాక్ ఏంటంటే తుపాకి సీక్వల్ కథ మురుగదాస్ విజయ్ కు వినిపించగా కథ నచ్చక విజయ్ ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పాడని అంటున్నారు. ఏది ఏమైనా తుపాకి 2లో కమల్ హాసన్ నటిస్తున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో కమల్ హీరోగా అనగానే అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇండియన్ 2 కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోగా ఆ సినిమా మొదలైనా కాకపోయినా ముందు తుపాకి 2ని సెట్స్ మీదకు తీసుకళ్లాలని చూస్తున్నారు కమల్ హాసన్. కొన్నాళ్లుగా ఫాం లో లేని మురుగదాస్ కూడా తుపాకి 2 కోసం సూపర్ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: