తండ్రి మీద ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తారు. కొంతమంది ఏమి మాట్లాడుకోకపోయినా తండ్రి మీద ఇతరుల వద్ద అమితమైన ప్రేమను చూపిస్తారు. ఇంకొంతమంది తండ్రి అంటే ఎంత ఇష్టమో వారి చేతల ద్వారా చూపిస్తారు. ఇంకొంతమంది వారు ఎంతో ప్రేమగా ఉంటూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ హీరోగా తెరకెక్కిన హైపర్ సినిమా తండ్రి కొడుకుల ప్రేమ ఈ విధంగా కూడా ఉంటుందా అన్న విధంగా అనిపించారు. మాస్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశికన్నా హీరోయిన్ గా నటించగా 2016లో విడుదలై ఈ చిత్రం టాలీవుడ్లో మంచి కుటుంబ కథా చిత్రంగా నిలిచింది.

నీతికి నిజాయితీకి మారుపేరైన ప్రభుత్వ ఉద్యోగి హీరో తండ్రి. అలాంటి తండ్రికి ఓ రౌడీ వల్ల వచ్చే ఇబ్బందులను హీరో ఏ విధంగా ఎదుర్కొని అతన్ని ఓడించి తండ్రి ని గెలిపించాడు అనేదే ఈ సినిమా కథ. ఈ యాక్షన్ సినిమా సినిమాలో రామ్ చక్కగా ఒదిగిపోయి నటించాడు. తండ్రి పాత్రలో సత్య రాజ్ నటించగా ఆయన తన తండ్రి పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. నిజజీవితంలో రామ్ తండ్రి అయినా స్రవంతి రవికిశోర్ పై ఉన్న ప్రేమను రామ్సినిమా ద్వారా చూపించి హిట్ అందుకున్నాడు..

ఏదేమైనా రామ్సినిమా హిట్ తో మరో స్థాయికి వెళ్ళాడు.. ప్రతి నటుడు ఇలాంటి సినిమా ఒకటి చేయాలి అన్న రేంజ్ లో ఈ సినిమా ను తెరకెక్కించి టైటిల్ కి తగ్గట్లు హైపర్ గా నటించాడు. ముఖ్యంగా తండ్రి జోలికొస్తే ఊరుకునేది లేదనే విధంగా ఎంతో వైవిధ్య భరితమైన పాత్ర లో నటించాడు. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర‌ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంటు పై ఈ సినిమా నిర్మించగా  లహరి ఆడియో ద్వారా విడుదల అయినా జిబ్రాన్‌ అందించిన  ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. గతంలో రామ్ కి ‘కందిరీగ’లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇద్దరికీ మంచి పేరు తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: