టాలీవుడ్ లో చాలామంది తండ్రి కొడుకులు రాణిస్తున్నారు. ఒకరు ప్రొడ్యూసర్ గా మరొకరు హీరోగా, ఇద్దరు హీరోలుగా, ప్రొడ్యూసర్ లుగా, దర్శకులుగా ఇలా పలు పలు విభాగాల్లో తండ్రీ కొడుకులు కలిసి టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్నారు. అలా టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ ఆయన కొడుకు టాలీవుడ్ హీరో గా ఇద్దరు తెలుగు సినిమా స్థాయిని పెంచే పనిలో బిజీ గా ఉన్నారు.. అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ పలు సందర్భాల్లో చూపిస్తూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. అల్లు రామలింగయ్య తనయుడిగా టాలీవుడ్ కి వచ్చిన అల్లు అరవింద్ తండ్రి పేరును దిగజార్చేలా ఎప్పుడు ప్రవర్తించలేదు.

ఆ విధంగానే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన తండ్రి పేరుప్రఖ్యాతలను తక్కువ చేసేలా ఎప్పుడు ప్రవర్తించలేదు.  ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం తన తండ్రి ప్రభావం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తండ్రి కొడుకుల నేపథ్యంలో బన్నీ హీరోగా చేసిన సన్నాఫ్ సత్యమూర్తి మరియు అల వైకుంఠ పురం లో సినిమాలను తన తండ్రికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే.  అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లో ఎంత బిజీ అయినప్పటికీ ఫ్యామిలీతో సమయం గడపడం కోసం చాలా సమయం వెచ్చిస్తూ ఉంటాడు.

భార్యా పిల్లలతో కాకుండా తల్లిదండ్రులతో కూడా మరింత సమయాన్ని కేటాయించి వారి ప్రేమానురాగాలను పొందుతూ ఉంటారు. తండ్రి వద్ద ఎంత చనువు ఉన్న అన్ని విషయాలు చెప్పలేడు కాబట్టి అల్లు అర్జున్ ప్రేమించిన విషయాన్ని తల్లితో తండ్రికి చెప్పించి పెళ్లికి ఒప్పించాడు.ఏ కొడుకుతో అయినా తండ్రి కొంత కఠినం గా ఉంటాడు ఎందుకంటే తన కొడుకు ఎక్కడ చెడిపోతాడో అని.  ఆ విధంగానే కొన్నిసార్లు అల్లు అరవింద్ కటువుగా ప్రవర్తించిన అది తన మంచికోసమే అని, మా నాన్న మనసు బంగారం అని అల్లు అర్జున్ చాలా వేదికల్లో తెలిపాడు.  అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ కాంబినేషన్లో అల్లు అర్జున్ హీరోగా చాలా సినిమాలు తెరకెక్కించారు.  అల్లు అరవింద్ కు మరియు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఈ ముగ్గురిలో ఒకరు తక్కువ కాదు ఎక్కువ కాదు అనే విధంగా అల్లు అరవింద్ అందరికి మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: