నిత్యా మీనన్.. చూడడానికి పెద్ద కళ్ళతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూ, అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవలచాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం, వెబ్ సిరీస్ చేయడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ లను చేయడానికి ఓకే చేస్తూ, తమ లైఫ్ లో బిజీ అయిపోతున్నారు.
ఇక అలాంటి వారిలోనే తమన్నా, కాజల్, సమంత లు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా విమర్శల పాలైన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈమె నటించిన వెబ్ సిరీస్ విమర్శలపాలు అయినప్పటికీ, మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈమెకు ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నడూ లేని విధంగా ,ఎప్పుడూ చూడని విధంగా సమంతాను  ఈ సీరీస్ లో  మనం చూడవచ్చు.ఇదిలా ఉండగా ,అందాల బొమ్మ నిత్యామీనన్ ఇదివరకే డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కు జోడీగా "బ్రీత్ ఇన్ టు ది షాడోస్ " అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక అమెజాన్ లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన లభించిందని చెప్పవచ్చు. 

ఇటీవల ఓటీటీ సంస్థలు హీరోయిన్లను వెబ్ సీరీస్  పేరిట లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్వరలో నిత్యమీనన్ కూడా ఓ టీ టీ సంస్ధ అయిన  అమెజాన్ మరొక వెబ్ సిరీస్ కోసం ఆమెను లాక్  చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ వేదికగా ఈమె మరో వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతోందిఒక కన్నడ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమవుతోంది. ఇక పూర్తవగానే త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: