అక్కినేని నాగేశ్వరరావు వారసుడు గా నాగార్జున సినీ ఇండస్ట్రీ ప్రవేశం చేస్తే ఆయన పెద్ద వారసుడిగా అక్కినేని నాగ చైతన్య జోష్ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి 100% లవ్, మనం, ప్రేమమ్, వెంకీ మామ వంటి చిత్రాలతో టాప్ హీరోగా ఉన్నాడు. నాగార్జున మొదటి భార్య కు పుట్టిన సంతానం గా అక్కినేని నాగ చైతన్య ఉన్నాడు. వెంకటేష్ చెల్లెలు, డి.రామానాయుడు కూతురు లక్ష్మికి నాగార్జునకు మొదటి వివాహం కాగా వీరి కాపురానికి ఫలితంగా నాగచైతన్య జన్మించాడు.

ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు అయితే తండ్రి మీద ఉన్న ప్రేమతో తల్లి మీద ఉన్న మమకారంతో ఇద్దరితో తన ప్రేమను పంచుకుంటూ వస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్లి పోయి అక్కడ విద్యనభ్యసించాడు. ఆ తర్వాత ఒక వయసులోకి వచ్చిన తర్వాత హీరోగా చేయాలని చెప్పి ముంబయ్ లోని స్టూడియోలో, క్యాలిఫోర్నియా లో తండ్రి  సలహా మేరకు నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తన పేరెంట్స్ మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు.

హీరో అయిన తర్వాత నాగచైతన్య తండ్రితోనే ఉంటున్నాడు. సమయం ఉన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్లి వస్తూ తండ్రి తో  పాటు హీరోగా ఇక్కడ కొనసాగుతూ వస్తున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మనం సినిమాలో నటించి ఒకరితో ఒకరు నటించాలన్న కోరిక తీర్చుకున్నాడు నాగార్జున. నాగ్ కు అఖిల్ అనే మరో కొడుకు కూడా ఉన్నాడు. అమల ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జున అఖిల్ ను కూడా హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అయితే ఇంతవరకు అఖిల్ కి హిట్ పడలేదు. చేస్తున్న నాలుగో సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ విధంగా మూడు తరాలుగా తండ్రీ కొడుకులు కలిసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: