ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ప్రియ పుత్రుడు అయిన రామ్ చరణ్ ఇప్పటివరకు కేవలం 13 చిత్రాల్లోనే నటించారు. కానీ 100 చిత్రాలు తీసిన సీనియర్ హీరోల కంటే ఎక్కువగా పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రెండవ చిత్రంతోనే భారత దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. మగధీర వంటి భారీ బడ్జెట్ ఫ్యాంటసీ సినిమాలో టైటిల్ రోల్లో నటించాలంటే నటనలో ఎంతో ప్రతిభ ఉండాలి. సినిమా హిట్టా పట్టా అనే విషయం హీరో పర్ఫామెన్స్ మీదనే ఆధారపడుతుంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రామ్ చరణ్ అన్ని బాధ్యతలు తన భుజాలకెత్తుకొని అద్భుతంగా నటించి మంచి యాక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే మగధీర సక్సెస్ రామ్ చరణ్ కంటే చిరంజీవికే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. రెండవ సినిమాతోనే తన కొడుకు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడంతో చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. చరణ్ లాంటి కొడుకుని కన్నందుకు తనకు గర్వంగా ఉందని ఎన్నో సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు. చరణ్ కూడా తన నాన్న పట్ల ఎంతో భయం భక్తి చూపిస్తుంటారు. వీళ్ళిద్దరూ తండ్రీకొడుకులా కంటే మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. ఒక తండ్రిగా, ఒక సక్సెస్‌ఫుల్‌ యాక్టర్ గా తన కుమారుడు చెర్రీ ని స్టార్ హీరో చేయాలని చిరంజీవి ఎన్నో కలలు కన్నారు. తనలాగా తన కొడుకు కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాలని చిరు నడుం కట్టారు.

ఐతే తండ్రి చిరంజీవికి ఎక్కువ శ్రమ కల్పించకుండానే చరణ్ తన హార్డ్ వర్క్ తో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. పాన్ ఇండియా మూవీ "ఆర్ఆర్ఆర్" లో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ త్వరలోనే ఇంటర్నేషనల్ స్టార్ అవుతారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే తన కుమారుడు తన రంగంలో అద్భుతంగా రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతుండటంతో తండ్రిగా చిరంజీవి ఎంతో ఆనందపడుతున్నారు.

మగధీర సినిమా చూసిన తర్వాత చిరంజీవికి కూడా ఒక రాజు లాగా కాస్ట్యూమ్స్ ధరించి కత్తిపట్టి పోరాటం చేయాలని అనిపించిందట. దీంతో రామ్ చరణ్ వెంటనే తన తండ్రిని హీరోగా పెట్టి సైరా నరసింహారెడ్డి సినిమా చేయించారట. తన కొడుకు వల్ల తన కోరిక తీరి పోయిందని.. ఎక్కడైనా తండ్రి కుమారుని కోరికలు తీరుస్తాడని కానీ తన విషయంలో కొడుకే తండ్రి కోరిక తీర్చాడని ఒక సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు. తన కొడుకుకి తన పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీరు ఏం సాధించారని నన్ను అడిగితే నేను చరణ్ ని సాధించానని గర్వంగా చెబుతానని ఆయన అన్నారంటే చరణ్ చిరు ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. చరణ్ సినిమాలలో చిరంజీవి చాలాసార్లు గెస్ట్ గా కనిపించారు. చిరు సినిమాలో చరణ్ కూడా కొన్నిసార్లు గెస్ట్ గా కనిపించారు. దీనిబట్టి నిజ జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇక ఆచార్య సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: