కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కొద్దిగా అదుపులోకి రావడంతో సినిమా షూటింగ్ లు అన్నీ మొదలవ్వడమే కాకుండా ఈఏడాది దసరా కు సంక్రాంతి రేంజ్ లో భారీ సినిమాల హంగామా ఉండబోతోంది. దీనితో టాప్ హీరోలు అంతా తాము నటుస్తున్న సినిమాల షూటింగ్ కు సంబంధించి పెండింగ్ సీన్స్ ను పూర్తి చేసే పనిలో బిజీ కాబోతున్నారు.


ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉండగానే స్టార్ మా యాజమాన్యం ‘బిగ్ బాస్ సీజన్ 5’ కు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ షోను సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతుందని వచ్చేనెల జూలై నుండి ఈషో ఆడిషన్స్ ప్రారంభం అవుతాయని టాక్.


ఈసారి షో కాంటెస్ట్ లలో రెండు సెలెబ్రెటీ జంటలు ఉంటాయని దీనికోసం ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభం అయింది అంటున్నారు. ఈషోకు సంబంధించిన కాంటెస్ట్ ల ఎంపిక జూలై చివరికి పూర్తి చేసి ఆగష్టు రెండవ వారం నుండి వారందర్నీ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ముందుగానే హోమ్  క్వారంటైన్ లోకి తీసుకురావాలని పక్కా ప్లాన్ అంటున్నారు. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం నాగార్జునను కలిసి ‘బిగ్ బాస్ సీజన్ 5’ హోస్టింగ్ విషయంలో ప్రాధమీక చర్చలు జరిపి నాగ్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రాధమీకంగా ఈ షోను హోస్ట్ చేయడానికి నాగ్ ఆశక్తి కనపరుస్తూ ఉండటంతో ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించిన ఫారెన్ షెడ్యూల్ ను ఆగష్టు లోగా పూర్తి చేసుకుని సెప్టెంబర్ నుండి ఈ షోకు అందుబాటులో ఉండాలని బిగ్ బాస్ నాగార్జునను కోర్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షోకి సంబంధించి స్టార్ మా యాజమాన్యం ఆలోచనలలో ఉన్న వివిధ రంగాలకు చెందిన కాంటెస్ట్ ల వివరాలను నాగార్జునకు తెలియపరచడంతో వారి విషయంలో నాగ్ బిగ్ బాస్ టీమ్ కు కొన్ని సూచనలు ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: