సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవరికీ తెలియదు. సినిమాల్లోకి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత అదృష్టం కలిసి వచ్చి సినిమా అవకాశాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. కెరీర్ మొదట్లోనే అదృష్టం కలిసి వచ్చి సినిమాలు చేసుకుంటూ పోయి స్టార్ లు ఎదిగిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా తెలుగులో ఆ ఒక్కడు సినిమాతో పరిచయమైన హీరోయిన్ మధురిమ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది కానీ అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేదు.

ఈ అమ్మడికి తెలుగులో సక్సెస్ అయితే ఇంతవరకు రాలేదు దాంతో క్రమంగా టాలీవుడ్ కి దూరం అయింది. అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ వచ్చినా తన విధిని మాత్రం టాలీవుడ్ లో మార్చుకోలేకపోయింది. తన పేరు మార్చుకొని ఉత్తరాదిన బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.  ఉత్తరాదిన హలో జీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది.  ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ లో ఆమె ఎంతో హాట్ గా కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసింది.  అయితే  ఆమెను చూసిన వారు మాత్రం అప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె నటనకు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరియు సోషల్ మీడియాలో కొన్ని ఆమె ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ అమ్మడి నటనకు ప్రశంసలు దక్కడంతో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. మధురిమ అలియాస్ నైరా బెనర్జీ ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఆమెకు తమ సినిమాల్లో నటించాలని అడ్వాన్సులు కూడా ఇస్తున్నారట  మరి తెలుగులో ఈమె తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకుంటుందా అనేది చూడాలి. ఎక్కడపోయిందో అక్కడే వెతుక్కునే అలవాటు ఉంటే మాత్రం తెలుగు లో ఈమె తప్పకుండా రాణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: