దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా మహమ్మారి వేళా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చాలా సాంగ్స్ వచ్చాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్ పై 'దారే లేదా' అనే సందేశాత్మక సాంగ్ ని చిత్రీకరించారు.

ఇక ఈ పాటను విపత్కార క్లిష్ట సమయంలో సహాయ సహకారాలు అందిస్తున్న కోవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కు అంకితమిస్తూ చిత్రీకరించారు. అయితే ఈ మ్యూజిక్ వీడియోలో హీరో సత్యదేవ్‌, రూప‌ నటించారు. ఇక కరోనా మహమ్మారి విజృంబిస్తున్న ఈ క్లిష్ట సమయంలో డాక్టర్స్ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైద్యులు వారి కుటుంబాలను వదిలేసి మరీ ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ల‌కు కట్టినట్లు ఈ సాంగ్ లో చిత్రీకరించారు.



అయితే 'దారే లేదా' సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా 'దారే లేదా' వీడియోపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కరోనా విపత్కర సమయంలో " మన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ ను గౌరవించేందుకు మంచి దారిని ఎన్నుకున్నారని అన్నారు. ఇక నిండు హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం సంతోషంతో నిండిపోయిందని తెలిపారు. ఈ సాంగ్ లో నాని, అతని టీమ్‌ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారని మహేష్‌ ప్రశంసించారు. అయితే  దారే లేదా' సాంగ్ కు కేకే లిరిక్స్ అందించగా.. విజయ్ బులగానిన్ సంగీతం అందించారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: