కొంతమంది ఎంత ప్రతిభావంతులంటే వారిలో ఆల్ రౌండర్ కళలు ఉంటాయి. ఏ రంగంలో అయినా ఇట్టే రాణించి పేరు సంపాదిస్తారు. అన్నం ఉడికింది అని చెప్పడానికి అన్నం మొత్తం చూడాల్సిన పనిలేదు ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది అన్నట్లు కోమలి సిస్టర్స్ లో ఎంత టాలెంట్, ఎంత ప్రతిభ ప్రతిభ ఉందొ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. వారి చిన్న వయసులోనే మిమిక్రీ ఆర్టిస్టుగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు ఈ కోమలి సిస్టర్స్.

తమ టాలెంట్ తో ఎంతో మందిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే వారు వీరు.. ఇంత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఏంటి అని ఎంతో మంది ఆశ్చర్య పడేలా చేశారు. వీరి జీవితం నాశనం చేస్తున్నారు చదువులకు దూరం చేస్తున్నారు అన్న విమర్శలను ఎదుర్కొన్నా కూడా కోమలి సిస్టర్స్ అంటే బ్రాండ్ అన్నట్లు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంతగానో తమ ప్రతిభ తో పైకి ఎదిగారు. ఒకప్పుడు ఎంతో బిజీగా ఉండే వీరు ఇప్పుడు కనిపించడం లేదు . వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం.

కోమలి సిస్టర్స్ లో ఒకరు హిరోషిణి, ఇంకొకరు దేవర్షినీ,. టాలెంట్ విషయంలో ఎవరూ తక్కువ కాదు.. ఒకరిని మించి ఒకరు తమ ప్రతిభను చూపిస్తూ ఉంటారు. రూపాలు రెండైనా వీరిద్దరి టాలెంట్ ఒక్కటే. చాలా మిమిక్రీ టాలెంట్ చేయగలరు. టాలెంట్ తో పాటు అందం కూడా హిరోషినీ సొంతం. ఈమె పెద్ద అమ్మాయి కావడంతో అందరు ఈమెపై దృష్టి పెట్టేవారు.. ఈ  ఇద్దరు రికార్డు స్థాయిలో సంపాదించేవారు. తద్వారా సినిమాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. ఎక్కువగా న్యూస్ చానల్స్ లో ఇద్దరు కనిపిస్తూ రాజకీయంగా సినిమాపరంగా వార్తలను ప్రజలకు నచ్చే విధంగా రూపొందించిన కామెడీ ప్రోగ్రామ్స్ లో చేసేవారు.. ఈ ఇద్దరికీ బోల్డంత కూడా వచ్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఇక హిరోషిణి తమిళ కన్నడ సినిమాల్లో హీరోనే గా ప్రయత్నిస్తుంది.. దేవర్షిణి విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: