సినిమా వాళ్లు, రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర సెల‌బ్రిటీలు డ్ర‌గ్స్ మ‌త్తులో తూలుతూ ఉండ‌డం కామ‌న్‌. అంద‌రూ అని కాదుకాని.. కొంద‌రు మాత్రం పార్టీలు, ప‌బ్బుల పేరుతో ఈ డ్ర‌గ్స్ సంస్కృతికి విప‌రీతంగా అల‌వాటు ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు ఇదే స్టేట‌స్ గా ఫీల‌వుతున్నారు. ఇక సినిమా వాళ్లకు డ్ర‌గ్స్ వాడ‌డం అనేది చాలా కామ‌న్‌. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే డ్ర‌గ్స్ వాడుతూ చాలా మంది దొరికిపోయారు కూడా..!  గ‌తంలో డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది.

తెలుగు, త‌మిళ్ , క‌న్న‌డ రంగాల‌తో పాటు బాలీవుడ్ కు చెందిన ప‌లువురు హీరోలు, హీరోయిన్లు, ఇత‌ర టెక్నీషియ‌న్లు ఈ డ్ర‌గ్స్ పార్టీలు చేసుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. ఇక ఇటీవ‌ల క‌న్న‌డ రంగాన్ని కూడా డ్ర‌గ్స్ కేసు ఎలా ఊపేసిందో చూశాం. అంతెందుకు కొద్ది రోజుల క్రిత‌మే  నైరా షా అనే హీరోయిన్‌ డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయింది. ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా నైరాషాను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమె బ‌ర్త్ డే పార్టీలో ఏకంగా ఫ్రెండ్స్ కు కూడా డ్ర‌గ్స్ స‌ప్లై చేసింది.

ఈ కోవ‌లోనే టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె సైతం డ్ర‌గ్స్ వాడుతూ చివ‌ర‌కు భ‌ర్త‌కు కూడా దూర‌మైంది. స‌ద‌రు హీరో త‌న కుమార్తె మీద ప్రేమ‌తో ఏకంగా చెన్నైకు చెందిన అబ్బాయితో పెళ్లి చేశాడు. అయితే రెండేళ్ల క్రిత‌మే ఆమెకు ఉన్న ఈ డ్ర‌గ్స్ వాడ‌కం, డ్రింక్స్ అల‌వాట్ల‌తో భ‌ర్త తో తీవ్ర‌మైన విబేధాలు వ‌చ్చాయి. ఇప్పుటు పుట్టింటికి హైద‌రాబాద్ వ‌చ్చేసిన స‌ద‌రు స్టార్ హీరో కుమార్తె డ్ర‌గ్స్ మ‌త్తులో తూలుతోంద‌ట‌. వీకెండ్ పార్టీల్లోనూ ఆమె డ్ర‌గ్స్ పార్టీల‌కు వెళుతోంద‌న్న వార్త ఇండ‌స్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: