అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును అందిస్తారు. బిడ్డ వేలు పట్టుకొని ఈ ప్రపంచంలో ఎలా రాణించాలో చూపిస్తాడు. కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ ఇంటిల్లపాది జీవితాల్లో వెలుగులు నింపుతాడు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తండ్రి శ్రమను గుర్తిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా తమ తండ్రులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తమ నాన్నల గొప్పతనాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా కష్టపడే నాన్నలందరికీ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. అలాగే పితృ దినోత్సవం సందర్భంగా ఆయన తన నాన్నని గుర్తు చేసుకున్నారు.


"మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలు నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి హ్యాపీ ఫాదర్స్ డే." అని చిరంజీవి తాజాగా ట్విట్టర్ వేదికగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.



అయితే చిరంజీవి తన ట్వీట్ కి ఒక ఫోటో జతచేశారు. ఆ ఫోటోలో చిరంజీవికి తన తండ్రి కొణిదెల వెంకట్రావు కేక్ తినిపిస్తున్నారు. అయితే పితృ దినోత్సవం సందర్భంగా తన తండ్రితో గడిపిన మధుర క్షణాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలాగే చిరంజీవి తన నాన్న గురించి చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా చిరంజీవి పోస్టులు మనసును హత్తుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టు కూడా అందరి మనసులను దోచుకుంటోంది.



ఇకపోతే చిరంజీవి తండ్రి వెంకట్రావు జగత్ కిలాడీలు, కిలాడీ బుల్లోడు, మంత్రిగారి వియ్యంకుడు చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 2007 డిసెంబర్ 24వ తేదీన కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: