సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ భారత దేశ వ్యాప్తంగా లక్షల మంది అభిమానులను కలిగి ఉన్నారు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక కోటి 68 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే ఆమె తనకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంటారు. తాను పాడిన పాటలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటారు. తన సోదరి మణి అక్షర హాసన్ కి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రియుడికి, తన పిల్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు.


సాధారణ రోజుల్లోనే తన అభిమానులతో అన్ని విషయాలు పంచుకునే శృతి పితృ దినోత్సవం రోజున తన నాన్న కి సంబంధించి మరిన్ని విషయాలు పంచుకున్నారు. తన తండ్రి "కలైమామణి" కమల్ హాసన్ గురించి ఆమె షేర్ చేసి ఒక స్వీట్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.



"మీరు ఏ వ్యక్తి నుంచి ఎక్కువగా నేర్చుకుంటారో.. మిమ్మల్ని ఏ వ్యక్తి ఎక్కువగా నవ్విస్తారో.. ఆ వ్యక్తి మీకు తండ్రి అయితే మీరు ధన్యులు. హ్యాపీ ఫాదర్స్ డే. నాకు తండ్రి అయినందుకు మీకు(కమల్) ధన్యవాదాలు," అని శృతిహాసన్ తన నాన్నకి చాలా గొప్పగా పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



అయితే ఈ పోస్ట్ తో శృతి జతచేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో చాలా ఫన్నీగా ఉంది. కమల్ హాసన్ ఫన్నీ ఫేస్ తో కెమెరా కి పోజ్ ఇచ్చి శృతిని నవ్విస్తున్నట్లుగా తెలుస్తోంది. సెవెంత్ సెన్స్ సినిమాలోని తన పాత్రకు శృతిహాసన్ "బెస్ట్ ఫిమేల్ డెబ్యూ" ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ అవార్డు తన తండ్రి చేతుల మీదగా శృతిహాసన్ అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా దీనిని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.


శృతి తన తండ్రి చేతుల మీదగా చాలా అవార్డ్స్ అందుకున్నారు. ఒకసారి శృతి తన తండ్రితో కలిసి డాన్స్ కూడా వేశారు. మరో సందర్భంలో ఆమె తన తండ్రి పాదాలకు నమస్కరించి తన ప్రేమను చాటుకున్నారు. ఇకపోతే కమల్ హాసన్ శృతి కి ఒక తండ్రిగా కంటే మంచి స్నేహితుడిగా ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: