గత ఏడాది నుంచి సినిమాలన్నీ థియేటర్స్ కోసం ఎదురుచూడకుండా ఓటిటిలో హాయిగా విడుదల చేసి లాభాలు పొందుతున్నాయి.ఇలా ఓటిటి లో విడుదలైన సినిమాలు హిట్ టాక్ వచ్చిన ప్లాప్ టాక్ వచ్చిన కూడా ప్రొడ్యూసర్స్ మాత్రం నష్టపోవట్లేదు. ఇది ఒకందుకు చాలా మంచిది ఎందుకంటే ఒకప్పుడు చిన్న సినిమాకి థియేటర్స్ దొరక్క నిర్మాతలు చాలా నష్టపోయేవారు. ఇప్పుడు ఆ భాధలేదు. సినిమా ట్రైలర్ బాగుంటే ఏ సినిమాని అయిన ఓటిటి వాళ్ళు కొనేస్తున్నారు.ఇక ఈ లిస్ట్ లోకి కొత్తగా నితిన్ చేస్తున్న మాస్ట్రో కూడా చేరబోతుంది అని టాక్.

 హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన అందదున్ సినిమాను తెలుగులోకి మెర్లపాక గాంధీ డైరెక్షన్ లో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో నితిన్ కళ్ళు లేని గుడ్డివాడిగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో తమన్నా మరియు నభ నటాష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నితిన్ ఇప్పటికే రెండు ప్లాప్ సినిమాలు వచ్చాయి. చెక్ సినిమా నెగటివ్ టాక్ తో ప్లాప్ అవతే రంగ్ దే సినిమా హిట్ టాక్ తో కూడా ప్లాప్ అయింది.అందుకె నితిన్ ఇంకా థియేటర్స్ లో మాస్ట్రో విడుదల చేసి రిస్క్ చేయడం ఎందుకు అని ఓటిటిలో రిలీజ్ ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అని టాక్.

సినిమా కూడా కొంచెం తెలుగు వాళ్ళకి కొత్తగా ఉంటుందేమో అని డౌట్ లో మూవీ టీం ఉన్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మద్యనే పూర్తి అయింది.ఈ సినిమా గురించి అందరికి పెద్ద ప్రశ్న ఏంటి అంటే హిందీలో టబు అద్భుతంగా చేసిన పాత్రని తెలుగులో తమన్నా ఎలా చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు అంత. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు మనకు ఆ  విషయం మీద క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: