మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3, గని సినిమాలు చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఎఫ్3 సినిమాలో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఆ సినిమాతో పాటుగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో గని సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో రాబోతున్నాయి. అయితే ఈ సినీమల తర్వాత వరుణ్ తేజ్ తన ప్లాన్ మార్చుకోవాలని చూఒస్తున్నాడు. ఇక మీదట యువ దర్శకులతో కాకుండా మరో మూడు సినిమాల వరకు సీనియర్ డైరక్టర్స్ తో సినిమాలు చేయాలని చూస్తున్నాడట.

సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ఇక మీదట యువ హీరోలతో సినిమాలు తగ్గించాలని చూస్తున్నాడు. కెరియర్ లో 8 సినిమాలు చేసిన వరుణ్ తేజ్ వాటిలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. యువ దర్శకులతో సినిమాలు మంచి ఫలితాలే ఇస్తున్నా సీనియర్ స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. అందుకే రాబోయే 3 సినిమాలు మాత్రం యువ దర్శకులతో కాకుండా సీనియర్ స్టార్ డైరక్టర్స్ కు అవకాశం ఇస్తున్నారట.

స్టార్ డైరక్టర్స్ ఎలాగు సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్నట్టు ఉంటుంది. వరుణ్ తేజ్ కూడా ఎలాంటి కథలు పడితే అలాంటి కథలు సెలెక్ట్ చేసుకోడు అందుకే వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్టులు స్టార్ డైరక్టర్స్ తో ఉంటాయని తెలుస్తుంది. అది కూడా హిట్ ఫాం లో ఉన్న స్టార్ డైరక్టర్స్ తోనే వరుణ్ తేజ్ డిస్కషన్స్ చేస్తున్నట్టు సమాచారం. హీరోగా తన టాలెంట్ చూపిస్తూ సత్తా చాటుతున్న వరుణ్ తేజ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించేలా చూస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: