ఆర్జీవీ.. కాంట్రవర్సిటీకి చిరునామా ఆ పేరు. ఎప్పుడూ తన చుట్టూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి తను మాత్రం తన పని చేసుకపోతాడు ఆర్జీవి. ప్రశాంతంగా  ఉన్న వాతావరణాన్ని, ఏదో ఒక అంశంపై తెరపైకి తీసుకొచ్చి దాని గురించి మాట్లాడుకునేలా చేస్తారు. శివ, దెయ్యం, బెజవాడ, రక్త చరిత్ర వంటి చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్జీవి పేరు ఎప్పటికీ ఓ సంచనలమే. ఆయనే కాదు ఆయన టీం కూడా ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇటీవల ఏపీ రాజకీయాలపై సెటైరికల్గా ఓ సినిమా తీసి వివాదాల్లో ఇరుక్కున్నారు. దీనిపై తెలుగు సినీ ఇండస్ట్రీలో, ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు జరిగాయి.

కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్ అయి అందులో అంతేం లేదు అని అన్ని సదుమణిగాయి. సామన్య మానవుడు వ్యక్తం చేయలేని భావనలు, ఆర్జీవి ఎలాంటి భ‌యం, సిగ్గూ, మోహమాటం లేకుండా భాహ‌టంగానే వ్య‌క్తం చేస్తారు. ఇలాంటి భావ‌న‌లు అంద‌రికీ ఉంటాయ‌ని, కానీ ఎవ‌రూ వ్య‌క్తం చేయ‌లేర‌ని తాను మాత్రం త‌న మ‌న‌సులో ఏమ‌నుకుంటున్నానో చెప్పేస్తాను అని చెబుతారు.

అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ ఫేం అరియానాతో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో సెక్స్ గురించి బోల్డ్ కామెంట్లు చేశారు ఆర్జీవి. ఈ ఇంట‌ర్వ్యూకి గంట ముందే సెక్స్‌లో పాల్గొన్నాన‌ని, ఇప్పుడు నిన్ను చూస్తూ కూడా మ‌న‌సులో శృంగారం చేస్తున్నాన‌ని చెప్పారు ఆర్జీవి. సెక్స్ అనేది ఒక భావ‌న మాత్ర‌మే అంటూ వ్యాఖ్య‌లు చేశారు ఆర్జీవి. సెక్స్ విష‌యంలో త‌ర‌చూ కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు ఆర్జీవి. ఒకరితోనే క‌మిట్ అయితే అత‌ను లేదా ఆమె ఏదో మిస్ అయిన‌ట్టేన‌ని బోల్డ్ కామెంట్లు కూడా చేశారు. ఆడవాళ్ళతో ఒక గంట సెక్స్ చేస్తే చాలు.. మిగతా ఇరవై మూడు గంటలు ఆడవాళ్ళతో తనకు పనిలేదని ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కేవ‌లం సంచ‌ల‌నాలు సృష్టించ‌డానికో లేక మీడియా దృష్టి త‌న‌పై ప‌డేలా చేసుకోవ‌డానికో తెలియ‌దు. మొత్తానికి ఆర్జీవి అంటే ఆర్జీవే. ఆయ‌న‌తో వేరే ఒక‌రిని పోల్చ‌డం కూడా త‌ప్పే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: