దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ రేపే పునఃప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 21వ తేదీన రాజమౌళి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని.. రేపే రామ్ చరణ్ సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయిందని.. ఇంకా 35 రోజులకు సంబంధించిన షూటింగ్ మిగిలి ఉందని.. మూడు పాటలు, కొంత శాతం టాకీ పార్ట్ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ వచ్చే రెండు నెలల్లో రాజమౌళి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఒకేసారి పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం రిలీజ్ డేట్ త్వరగా ప్రకటించాలని చిత్ర బృందం పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సినిమాని ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే అవకాశాలు సన్నగిల్లాయి.

మరోపక్క ఆర్ఆర్ఆర్ త్వరగా పూర్తిచేసి తమ తదుపరి చిత్రాలను ప్రారంభించాలి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భావిస్తున్నారు. దీంతో రాజమౌళి కూడా అందరికంటే ముందుగానే ఈసారి తన ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించడానికి రెడీ అయ్యారు. మిగతా దర్శకులు తమ సినిమాలను జులై మొదటి వారంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వారందరి కంటే ముందుగా రాజమౌళి షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. సాధారణంగా రాజమౌళి చాలా నిదానంగా షూటింగ్ పూర్తి చేస్తుంటారు. కానీ ఇద్దరు స్టార్ హీరోలని ఎక్కువ సేపు వెయిట్ చేయించడం ఇష్టం లేక ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: