మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అరకొర అవలాశాలతోనే కెరియర్ వెళ్లదీస్తుంది. సినిమాల కన్నా అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. మొదట్లో బొద్దుగా చాలా పద్ధతిగా కనిపించిన అనుపమ అవకాశాలు రాకపోవడానికి తన లుక్ కారణమని అనుకుని బక్కపలచగా మారింది. ఇక ట్రెండ్ మార్చడమే కాకుండా ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. కంప్లీట్ మోడ్రెన్ లుక్ తో.. కర్లీ హెయిర్ తో అనుపమ ఆకట్టుకుంటుంది. అంతేకాదు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.

సోషల్ మీడియాలో అనుపమ రచ్చ కొనసాగుతుంది. అమ్మడు తన ఇన్ స్టాగ్రాం లో కన్ను కొడుతూ ఓ వీడియో షేర్ చేసింది. అంతేకాదు నాచురల్ పిక్స్ ను షేర్ చేసింది. ఇలా చేయడం వల్ల ఆమె ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకున్నా అనుపమ సోషల్ మీడియా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అనుపమ నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తుంది. కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాతో నిఖిల్, అనుపమలకు ఇద్దరికి మంచి హిట్ వస్తుందన్ ఆశిస్తున్నారు. ఇక ఇదే కాకుండా చందు మొండేటి డైరక్షన్ లో నిఖిల్ చేస్తున్న కార్తికేయ 2లో కూడా అనుపమకి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ఒకేసారి రెండు సినిమాలతో నిఖిల్, అనుపమ అలరించనున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్లీ తెలుగులో అనుపమకి వరుస ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. ఓ పక్క మళయాళంలో సినిమాలు చేస్తున్న అనుపమ తెలుగు మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది అనుపమ పరమేశ్వరన్.




మరింత సమాచారం తెలుసుకోండి: