కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ ఓ సూపర్ హిట్ సినిమా సీక్వల్ లో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేని ప్రగ్యా ఎలాంటి ఛాన్సులు వచ్చినా కాదనకుండా చేస్తుంది. ఈ క్రమంలో ప్రగ్యా ఎఫ్3 సినిమాలో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమాలో నటిస్తున్న అమ్మడు ఈ సినిమాతో పాటుగా ఎఫ్3 సినిమాలో కూడా స్పెషల్ ఐటం సాంగ్ లో నర్తిస్తుందని అంటున్నారు.

ఈ సాంగ్ లో ప్రగ్యా స్కిన్ షో అదిరిపోతుందట. సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. దాని మీద డైరక్టర్ అనీల్ రావిపుడి స్పెషల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సాంగ్ ను క్రేజీగా ట్యూన్ చేసినట్టు టాక్. గబ్బర్ సింగ్ కెవ్వు కేక సాంగ్ ను మించేలా ఈ ఐటం సాంగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఎఫ్ 3 సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయినా సరే ఆ ఇద్దరిని ప్రగ్యా ఒక్క సాంగ్ తో బీట్ చేస్తుందని అంటున్నారు.

కంచె తర్వాత స్టార్ హీరోల సినిమాల అవకాశాలు తెచ్చుకోలేని ప్రగ్యా జైశ్వాల్ యువ హీరోల దగ్గరే ఆగిపోయింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో స్పెషల్ సాంగ్స్ కు సరే అని చెబుతుంది. ఈమధ్య వెబ్ సీరీస్ లైనా సరే చేస్తా అని హింట్ ఇస్తుందని తెలుస్తుంది. మరి ప్రగ్యా మళ్లీ తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఎఫ్3 సాంగ్ హిట్ అయితే మాత్రం అదే క్రమంలో ప్రగ్యా జైశ్వాల్ కు ఇలాంటి స్పెషల్ సాంగ్ ఆఫర్లే రావడం పక్కా అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: