టాలీవుడ్ హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో పలు స్టార్స్ తో సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక వరుస ప్లాపులు ఎదురుకోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. ఇక ఇప్పుడు ఈ ముద్దు గుమ్మకి టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లు అయితే లేవు. ఇక చివరగా నితిన్ తో చేసిన చెక్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి బోల్తా కొట్టింది. ఇక క్రిష్ అలాగే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయింది. ఇక ఆ ఒక్క సినిమాతోనే రకుల్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. అయితే దీని గురించి ఓ మీడియా సంస్థ ఆర్టికల్ రాసింది.ఇక టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు లేవంటూ వచ్చిన కథనంపై రకుల్ ప్రీత్ సింగ్ కౌంటర్ వేశారు. ఇక రకుల్‌ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్‌లో ఆఫర్లు లేవు. కానీ మిగతా భాషల్లో మాత్రం ఫుల్ బిజీగా వుంది. ఇక ఇదే విషయాన్ని రకుల్ కాస్త సెటైరికల్‌గా చెప్పడం జరిగింది.ఇక సంవత్సరానికి కేవలం 365 రోజులే ఉన్నాయి.. అందుకు ఆరు సినిమాలు చేయడానికి మాత్రమే వీలు అవుతోంది. ఇక ఎవరైనా డేట్స్ అడ్జస్ట్ చేసి నాకు సాయం చేస్తారా? మా టీంకు ఏదైనా సలహాలు ఇవ్వండి అని సదరు మీడియా సంస్థకు కౌంటర్ రకుల్ ప్రీత్ కౌంటర్ వేసింది.ఇక అలాగే హెడ్ లైన్ కోసం ఏదైనా రాసేస్తారా? అని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.

అయితే ఇలా రకుల్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఇక తెలుగులో ఆమెకు ఆఫర్లు రావడం లేదని అబద్ధమని ఖండించాడు.రకుల్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.. నీ డేట్స్ కోసం నా స్నేహితుడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నీకు స్క్రిప్ట్ బాగా నచ్చినా కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయావు.. అందుకే నీ కోసం సినిమా కూడా వాయిదా వేశాడు.. నీ పనులే నువ్వేంటో చెబుతాయి అంటూ రకుల్‌ను ఆకాశానికెత్తేశాడు హరీష్. అలా మొత్తానికి రకుల్ ఎంత బిజీగా వుందో.. ఎందుకు టాలీవుడ్‌లో సినిమాలు ఒప్పుకోవడం లేదో క్లియర్‌గా చెప్పేశాడు.ఇక బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ వరుసగా ఆఫర్లను కొల్లగొట్టేస్తున్నది.అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ లాంటి హీరోల సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: