జబర్దస్త్ బ్యూటీ వర్ష ఈమధ్య కాలంలో ఆ షోలో బాగా క్లిక్ అయ్యింది. అందానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వర్ష ముందు జీ తెలుగు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ కు ప్రమోట్ అయ్యింది. జబర్దస్త్ లో అన్ని టీం లకు కో కంటెస్టంట్ గా ఉంటూ వస్తుంది వర్ష. అయితే కెవ్వు కార్తీక్ టీం లో పర్మినెట్ ప్లేస్ సంపాదించింది. అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లడం ఆ టైం లోనే ఇమ్మాన్యుయెల్ కొద్దిగా పికప్ అవడంతో కెవ్వు కార్తీక్ టీం లో ఇమ్మాన్యుయెల్ మెయిన్ టీం మేట్ అయ్యాడు. ఇక అతనితో పాటు వర్ష కూడా ఆ టీం లో క్రేజీ కంటెస్టంట్ గా మారింది.

ఇక ఇమ్మాన్యుయెల్ తో వర్ష ట్రాక్ కూడా షోకి స్పెషల్ క్రేజ్ తెచ్చి పెట్టింది. తెల్లమ్మాయి, నల్లబ్బాయి జోడీగా వీరి ప్రేమాయణం హాట్ న్యూస్ గా మారింది. సుధీర్, రష్మి లానే వీరి ప్రేమ కేవలం షో వరకే పర్మితం అన్నట్టు తెలుస్తున్నా ఇమ్మాన్యుయెల్, వర్ష ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. వారిద్దరి మధ్య బయట కూడా నిజంగానే ఏదో ఉంది అనేంతగా రెచ్చిపోతుంటారు. ఈ క్రమంలో జబర్దస్త్ వర్ష సడెన్ గా ఎంగేజ్మెంట్ రింగ్ తో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. జూలై 4న ఓ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి మరి వర్ష రింగ్ ఫోటో తో షాక్ ఇచ్చింది.

మరో ఫోటోలో పెళ్లికి సంబందించిన జెవెలరీ కూడా చూపించింది. వర్షకు నిజంగానే ఎంగేజ్మెంట్ అయ్యిందా.. లేదంటే ఆమె కూడా ఏదైనా పబ్లిసిటీ స్టంట్ చేస్తుందా అన్నది తెలియాలంటె జూలై 4 వరకు ఆగాల్సిందే. చూస్తుంటే వర్ష కూడా తన ఎంగేజ్మెంట్ అంటూ బిల్డప్ ఇచ్చి సడెన్ గా ఇదంతా షో కోసమే అని ఏదైనా చెబుతుందా అని ఆడియెన్స్ ఫీల్ అవుతునారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూలై 4 వరకు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: