అమ్మ తన బిడ్డని తన కడుపులో 9 నెలలు మోస్తే.. నాన్న మాత్రం తన బిడ్డని జీవిత కాలం తన మెదడులో పెట్టుకొని పోషిస్తాడు.ఇక మన వెన్నంటి నాన్న ఉన్నారంటే అంతకుమించిన భరోసా ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. తన బిడ్డ ఎదుగుదలలో నాన్న పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అయితే ఇది కొందరి లైఫ్‌లో నాన్న ప్రేమ పొందే అదృష్టం ఎక్కువ కాలం ఉండదు. నాన్న మరణం తీరని శోకాన్ని మిగుల్చుతుంది. దీంతో నాన్న జ్ఞాపకాలు ఊపిరి ఉన్నంతవరకూ గుండెల్లో దాచుకుంటూ బరువెక్కిన హృదయంతో బాధ పడుతూ గడుపుతుంటాడు ఆ బిడ్డ.ఇక ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని తలచుకుంటూ బాగా ఎమోషనల్ అయింది సురేఖావాణి కూతురు సుప్రిత.ఇక సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తల్లి సురేఖ వాణి ద్వారా తెగ పాపులర్ అయ్యింది. నెట్టింట తల్లితో కలిసి హాట్ హాట్ ఫోజులు ఇస్తూ హాట్ హాట్ పిక్స్ తో కుర్ర కారుని ఎంతగానో ఆకట్టుకొని మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.ఈమధ్య కాలంలో అయితే తన తల్లితో బాగా ఎంజాయ్ చేస్తూ దిగిన హాట్ ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ అయ్యి అమ్మడుని బాగా ట్రెండ్ చేశాయి.ఇక ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను బాగా ఎంటర్‌టైన్ చేస్తూ ఆకట్టుకుంటుంది సుప్రిత.ఇక తాజాగా తన తండ్రి సురేష్ తేజతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.


 ''ఐ లవ్ యూ నాన్న రెండేళ్ల ముందు నాతో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటి ఫొటో ఇది. అప్పుడు నాకు ఇది తెలియదు అదే నాతో నువ్వు చేసుకునే లాస్ట్ ఫాదర్స్ డే అని.. నా కోసం మళ్ళీ తిరిగి రా నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే'' అంటూ సుప్రిత తీవ్ర భావోద్వేగం చెందింది.ఇక గతంలో కూడా చాలాసార్లు తన తండ్రి సురేష్ తేజపై ఉన్న ప్రేమను సుప్రిత బయటపెట్టింది.ఇక సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ఇంకా పలు యాడ్స్‌లోనూ నటించింది. అలాగే త్వరలోనే సుప్రిత సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. తల్లి సురేఖ వాణితో కలిసి ఆమె చేస్తున్న వీడియోలు, ఫొటోస్ యూత్ ని ఆకట్టుకొని సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంటాయి. ఇక తండ్రి సురేష్ తేజ మరణం తర్వాత సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తలను సుప్రిత ఈమధ్య బాగా ఖండించిన సంగతి తెలిసిందే.ఆ విషయం ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది. దాంతో తల్లి కూతుళ్లు బాగా ఫేమస్ అయ్యారు.ఇక సుప్రిత చేసిన ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక సుప్రిత ఫ్యాన్స్ అందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కాబట్టి స్ట్రాంగ్ ఉండమని సుప్రితకి తమ కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: