సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఫ్లాప్ లు రావడం సహజం. వారి సినిమా ఎంపికలో లోపం లేకపోయినా కొన్ని కొన్ని సార్లు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ప్రేక్షకుల అంచనాలను సరిగ్గా జడ్జ్ చేయలేక చిన్న పొరపాటు వల్ల హీరోలు ఫ్లాప్ లు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఒక్క ఫ్లాప్ తో చాలా మంది హీరోల కెరీర్ లు తారుమారు అయ్యాయి.  హిట్టు లేకుండా సినిమా చేస్తే ఈ రోజుల్లో నిలబడటం కష్టంగా మారింది. స్టార్ హీరోలను సైతం హిట్టు లేకపోతే, 50 రోజులు థియేటర్లో వారి సినిమా కనబడకపోతే మర్చి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

అందుకే ఈ మధ్య టాలీవుడ్ హీరోల కథలు ఎంపికలను గమనిస్తే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. నచ్చకపోతే ఎంతటి దర్శకుల కైన నో చెప్తున్నారు. ఆ విధంగా ఫ్లాప్ ను ఎదుర్కొని మళ్ళీ హిట్ కొట్టి కం బ్యాక్ చేయడానికి మన టాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున వరుస ఫ్లాప్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలతో ఆయన తన అభిమానులను నిరాశపరిచగా ప్రస్తుతం చేస్తున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోని సినిమా తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

నందమూరి బాలకృష్ణ గత సినిమాలైనా కథానాయకుడు, మహానాయకుడు, రూలర్, పైసా వసూల్ వంటి సినిమాలు ఫ్లాప్ కాగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న అఖండ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు బాలకృష్ణసినిమా ద్వారా విశ్వరూపం చూపించాడు అని అంటున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.  దీంతో ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా తో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగాపాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: