రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీత దర్శకత్వం  వహించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఎడిటింగ్ విషయంలోను కీరవాణి సలహాలు ఉంటాయి అంటారు. దీనికితోడు కీరవాణికి రాజమౌళితో ఉన్న బంధుత్వం రీత్యా జక్కన్న తీసే సినిమాల షూటింగ్ సమయంలో కూడ తరుచు షూటింగ్ స్పాట్ కు వస్తూ అనేక సలహాలు ఇస్తూ ఉంటాడు.

 

 
కొంతకాలం క్రితం రాజమౌళి తన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు భవిష్యత్ లో రాజమౌళి తీసే సినిమాలకు ఎవరు సంగీత దర్శకత్వం వహిస్తారు అనే ఆసక్తికర చర్చులు కూడ నడిచాయి. ఇలాంటి పరిస్థితులలో అత్యంత  భారీ అంచనాలతో జక్కన్న రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లోకి అనిరుద్ ఎంటర్ కావడం సంచలనంగా మారింది.  

 

 
రోజురోజుకి ‘ఆర్ ఆర్ ఆర్’ పై అంచనాలు పెరిగిపోతున్న పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిమరో క్రేజీ పాయింట్ యాడ్ అయింది. ఈ సినిమా కోసం గత రెండు రోజులుగా ప్రమోషన్ సాంగ్ పిక్చరైజ్  చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమోషన్ సాంగ్ ను యువ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడడటమే కాకుండా ఈ ప్రమోషన్ సాంగ్ లో అనిరుధ్ డ్యాన్స్  చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 
సంగీత దర్శకుడు అనిరుధ్ మల్టీ టాలెంట్స్ గురించి అందరికి తెలిసిన విషయాలే ఆమధ్య వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కోసం ప్రమోషన్ సాంగ్ ను  అనిరుద్ డిజైన్ చేసాడు. గతంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడ ఒక విడియో సాంగ్ ను డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షణాది ఫిలిం ఇండస్ట్రీలో అనిరుధ్ కు ఉన్న క్రేజ్ వల్ల అతడు చేత ఈ ప్రమోషన్ సాంగ్ చేయిస్తే  ‘ఆర్ ఆర్ ఆర్’ క్రేజ్ మరింత పెరుగుతుంది అన్న వ్యూహంతో అనిరుద్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈమూవీ అక్టోబర్ 13న విడుదల అని ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ ఇప్పటికే  ఒకటికి రెండు సార్లు ప్రకటించినప్పటికీ ఈమూవీ విడుదల తేదీ పై రకరకాల ఊహా గానాలు కొనసాగుతున్నాయి..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: