వెంకటేష్ నటనకు టాలీవుడ్ లో ప్రత్యేకస్థానం ఉంది. ఎలాంటి క్యారెక్టర్ కి అయినా వెంకీమామ సూటేపోతారు. ఎమోషన్స్ ని బాగా పండిస్తారు. అందులో ముఖ్యంగా రాజా, శ్రీను, చంటి లాంటి సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను ఎమోషన్స్ తో కన్నీరుపెట్టించ మానలేదు. వెంకటేష్ లో ప్రస్తుతం సాలీడ్ ఎమేషన్స్ సినిమాలు తగ్గుతూ వచ్చాయ్.

కానీ నారప్ప సినిమాతో వెంకీనటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రిమేక్ సినిమా అయినా వెంకీమామ ధనూష్ కు ఏమాత్రం తగ్గకుండా చేశారు. సినిమా చూసిన ప్రతిఒక్కరు వెంకటేష్ నటనను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఆ రేంజ్ లో వెంకీ చిత్రానికి ప్రాణంపోశారు.
 
నిజానికి చాలా రోజుల తర్వాత వెంకటేష్ కు సరిగ్గా సరిపోయే యాక్షన్ ఇంకా ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా చేశాడు. నారప్పలో వెంకటేష్ నటనతో టాలివుడ్ కి దొరికిన ఆణిముత్యం అని సినీప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ఇలా చేశాడంటే దానివెనుక ఉంది దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలానే. వెంకటేష్ దర్శకుడికి, ఒరిజనల్ డైరెక్టర్ వెట్రిమారన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
తమిళంలో అసురన్ పేరుతో రిలీజ్ అయిన చిత్రం కూడా అక్కడ రికార్డులు బ్రేక్ చేసింది. అందులో ధనుష్ నటన వర్ణాణాతీతం. సినిమా చూసినంతసేపు కూడా ధనుష్ పై ఇంట్రస్ట్ ఏమాత్రం పక్కకు మళ్లకుండా ఉంటుంది. ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక నారప్ప విషయానికి వస్తే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం సినిమా తర్వాత హిట్ లేదు. ఈ మూవితో శ్రీకాంత్ హిట్ కొట్టబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన మూవీ ఇప్పటికే చాలా మంది మనసులు దోచేసింది.

విలక్షణ నటుడిగా పేరున్న వెంకటేష్ కు ఈ చిత్రం ఇంకా పేరుతానుందనే చెప్పాలి. యాక్షన్ త్రిల్లర్ గా తెరెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలా మారింది. సినిమాలో కొన్ని సీన్స్ తో ఇన్ స్టా, ఫేస్ బుక్ లో అప్పుడే మీమ్స్, వీడియోస్ వచ్చేశాయి. మీరు ఇంకా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మరీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: