బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అప్పుట్లో హృదయకాలేయం, కొబ్బిరిమట్ట సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన అభిమానులు చేసుకున్నాడు. తాజాగా కేఎస్ పతాకం పై బజార్ రౌడీ పేరుతో సంపూర్ణేష్ బాబు మరో చిత్రం తీస్తున్నారు. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరీ వద్ది నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే పబ్లిక్ లో మాంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సినిమా ఘూటింగ్ పట్టాలెక్కేసింది. ఆగస్ట్ లో విడుదల చేయాలని చిత్ర బృందం సిద్దం చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత సందిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపూ స్టైల్ ని యూడ్ చేసి ఈ చిత్రాన్ని కుటుంబకథా చిత్రంగా తీర్చిదిద్దారు అని అన్నారు. నాగేశ్వరరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తెచ్చారని వెల్లడించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో సంపూకి, నిర్మాతకు దర్శకుడు వసంత నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుకు నచ్చేవిధంగా నవ్వులు, పాటలు, ఫైట్స్ అన్ని కలకలిపి చిత్రాన్ని రూపొందించాం అని అన్నారు. ఆగస్టులో చిత్రాన్ని ధియోటర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇంకా షియాజీ శిండే, పృథ్వి, కత్తిమహేష్, నాగివీడు,  పద్మావతి కీలకపాత్రల్లో నటించినట్లు సమాచారం. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

  ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సంపూ డైలాగ్స్ అయితే అబ్బో..చెప్కక్కర్లా వాటిగురించి. టీజర్ లో సంపూర్ణేష్ బాబు డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో సంపూ అత్తమామలను అల్లరి పెట్టే పాత్రలో అదరగొట్టబోతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో సంపూ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: