తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా కథ నచ్చితే ఆ సినిమాను ఇతర భాషలకు రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ రీమెక్ అనేది ఇప్పటి విషయం కాదు.. గోల్డెన్ డేస్ నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇక సాధారణంగా ఒకప్పుడు హీరోలు వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సమయంలో సేఫ్ గా హిట్ కొట్టడం కోసం రీమేక్ సినిమాలో నటించేవారంట. కాగా.. సినిమాలో కథ బలంతో మినిమమ్ హిట్ అందుకోవచ్చు గాని లోకల్ ఆడియెన్స్ కు కథ కనెక్ట్ అవ్వకపోతే రిస్క్ సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక చాలా సందర్భాల్లో రీమేక్ సినిమాలు బెడిసికొట్టాయని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలు సైతం రీమెక్ సినిమాలో నటించారు. ఆలా వాళ్ళ సినీ జీవితంలో సినిమాల్లో రీమేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఒకప్పుడు జనాలు రీమేక్ అని భేదం చూపేవారు కాదు అభిమానులు. అంతేకాదు.. కంటెంట్ నచ్చితే కాపీ కొట్టినా పట్టించుకునేవారు కాదంటా. కానీ.. ప్రస్తుతం గ్లోబల్ ఈజ్ లోకల్ అనే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఎలాంటి రీమేక్ చేసినా కూడా జనాలు అప్పుడే బేధాలు చూపడం మొదలు పెడుతున్నారు. అయితే నారప్ప వెంకటేష్ కు సరైన స్టోరీ అయినప్పటికీ ధనుష్ తో పోల్చడం వలన విలువ లేకుండా పోతుంది.

అంతేకాదు.. రీమేక్ ట్రై చేసినా కూడా ఎంతో కొంత భిన్నంగా ట్రై చేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్స్ అందుకున్నారు. కాగా.. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో రెడీ అవుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి.. లూసిఫర్, వేదళం, అలాగే మరొక సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొందరు యువ హీరోలు రీమేక్స్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: