శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్ కూడా అశ్లీల కంటెంట్ ను చిత్రీకరించి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిపినట్టు వెల్లడించింది. రాజ్ కుంద్రా పరోక్షంగా కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ యజమాని, పెట్టుబడిదారుడు కూడా. కానీ కుంద్రా ఇలాంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. రాజ్ కుంద్రా ఇప్పటికి ఎన్ని కాంట్రవర్సిల్లో చిక్కుకున్నారో చూద్దాం.

బాలీవుడ్ లో రాజ్ కుంద్రా అరెస్ట్, రిమాండ్ కు తరలించడం అనే విషయాలు సంచలంగా మారాయి. ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలను చిత్రీకరిస్తూ, పలు యాప్ ల ద్వారా వాటిని ప్రసారం చేస్తున్నాడు అనే కారణంతో ముంబై పోలీసులు అకస్మాత్తుగా సోమవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేసి తెల్లారే వరకూ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. తరువాత కోర్టుకు తరలించగా జూలై 23 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. అయితే రాజ్ కు కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. నిజానికి ఆయన ఇంతకుముందే ఇలాంటి భారీ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అవేంటంటే...    

బెట్టింగ్ కాంట్రవర్సీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్టు మాజీ సహ యజమాని రాజ్ పై రాజస్థాన్ రాయల్స్ బెట్టింగ్ ఆరోపణలతో క్రికెట్ లో జీవితకాలం నిషేధం విధించారు. బెట్టింగ్ కేసులో కుంద్రా, మాజీ ఐసిసి చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ దోషులుగా తేలారు. అయితే తరువాత ఢిల్లీ పోలీసులు అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. దయతో తరువాత కుంద్రా 2018లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చీటింగ్ టెక్స్ టైల్ కంపెనీ
2017లో ఒక వస్త్ర సంస్థ కుంద్రా తమను రూ.24 లక్షలు మోసం చేసాడని ఆరోపించింది. రాజ్ కుంద్రా, అతని భార్య, నటి శిల్పా శెట్టి సంస్థ పేరిట ప్రత్యేకంగా సేకరించిన డబ్బు తమకు ఇవ్వలేదని టెక్స్‌టైల్ కంపెనీ తమ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బిట్‌కాయిన్ స్కామ్
2018లో రాజ్‌ బిట్‌కాయిన్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రకారం కొంతమంది బాలీవుడ్ నటులు బిట్‌కాయిన్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అక్రమ కుంభకోణాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రాకెట్‌పై దాడులు చేసిన పోలీసులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

మాజీ భార్య గురించి అగ్లీ కామెంట్స్
రాజ్ కుంద్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య కవిత తన మాజీ బావమరిదితో ఎఫైర్ కలిగి ఉన్నారని ఆరోపించారు. కానీ అంతకుముందు కవిత మాత్రం శిల్పా శెట్టి తాను రాజ్ తో విడిపోవడానికి కారణమని ఆరోపించింది.

పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను సృష్టించడం
అశ్లీల చిత్రాలను రూపొందించడం, కొన్ని యాప్‌ల ద్వారా ప్రచురించడం వంటి కేసులో ముంబై పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. కుంద్రా ఈ కేసు కీలక నిందితుడిగా ఉన్నాడు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం ప్రకారం ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: