మాలీవుడ్ స్టార్ హీరోలు రూట్  మార్చారు. మల్టీ లింగ్వల్స్ సినిమాలతో మార్కెట్ పెంచుకునేందుకు సిద్ధమైపోయారు. సినిమా  ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేదు. మంచి కథ, సాంకేతిక పరిజ్ఞానం ఒక రేంజ్ లో ఉంటే చాలు. లోకల్ ఫీలింగ్స్ ని దాటేసి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టి భారీగా వసూళ్లు చేయడమే. ఆ గట్టి నమ్మకంతోనే మాలీవుడ్ స్టార్లు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు.  

మళయాళీ మెగాస్టార్ మమ్ముట్టి గతంలో బహుబాషా చిత్రాలు చేశాడు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా స్ట్రయిట్ మూవీస్ చేశాడు. 'స్వాతికిరణం, సూర్యపుత్రులు, యాత్ర' సినిమాల్లో మమ్ముట్టి లీడ్‌ రోల్స్‌ ప్లే చేశాడు. అలాగే తెలుగులో నటించడంతో పాటు డబ్బింగ్‌ కూడా చెప్పాడు మమ్ముట్టి. యాత్ర చిత్రంలో ఆయన నటన అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలి ఉండటం విశేషం.

అంతేకాదు మమ్ముట్టి వారసుడిగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్, తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. పెర్ఫామర్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి 'ఓకే కణ్మని' లాంటి సినిమాలతో కోలీవుడ్ లో అడుగుపెట్టాడు. అలాగే హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమిళ్, హిందీతో పాటు తెలుగు మార్కెట్‌పైనా ఫోకస్ పెట్టాడు దుల్కర్.

దుల్కర్ సల్మాన్‌ ఇప్పటికే తెలుగులో 'మహానటి' సినిమా చేశాడు. జెమిని గణేశన్‌ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు హనూ రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో దుల్కర్‌.. లెఫ్టినెంట్ రామ్‌ పాత్రలో నటిస్తున్నాడు.

మోహన్‌ లాల్‌ ఇప్పటికే తెలుగు మార్కెట్‌లో అడుగుపెట్టేశాడు. 'జనతాగ్యారేజ్'లో సపోర్టింగ్‌ రోల్‌తో వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు. ఈ కనెక్షన్‌తోనే మోహన్ లాల్ మళయాళం డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే కేరళ మార్కెట్‌ కోసం ఈ హీరోని సపోర్టింగ్‌ రోల్స్‌కి తీసుకుంటున్నారు తెలుగు మేకర్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: