మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి నటుడిగా గుర్తింపు ఉంది. ఈయన తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే వచ్చారు. అలా స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి కాస్త మెగాస్టార్ అయ్యాడు. ఇక అదే బాటలో తన తమ్ముళ్ళు, కొడుకులు, మెగా హీరో ఫ్యామిలీ అందరూ బాగానే స్టార్డం సంపాదించారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కొందరు చిరంజీవి బాటనే నడవనున్నారట. ఆ విషయాలు తెలుసుకుందాం.


మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ చిరంజీవి బాటలో  నడుస్తున్నట్లు సినీ వర్గాలలో వినికిడి. అదేమిటంటే, మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో తండ్రి, కొడుకులుగా  నటించిన సినిమాలు అంటే  ద్విపాత్రాభినయంలో ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు వీరి బాటలోనే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ద్విపాత్రాభినయంలో చేస్తున్నట్లు సమాచారం.

మొదటి సారిగా పవన్ కళ్యాణ్ వయసు ఎక్కువగా ఉన్న  తండ్రి  పాత్రలో నటించబోతున్నాడు అంటే.. అవుననే చెబుతున్నారు మెగా ఫ్యామిలీ వర్గాలు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తండ్రిగా, కొడుకుగా నటించబోతున్న, రెండు పాత్రలు వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఇలాంటి ప్రయోగం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఒక పాత్రలో లెక్చరర్, మరొక పాత్రలో ఐబి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.


ఇక రామ్ చరణ్ కూడా డైరెక్టర్ శంకర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని సెప్టెంబర్ మాసంలో షూటింగ్ స్టార్ట్ చేసే వీలు ఉందని సినీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరు ఇదే మొదటిసారి ఇలాంటి పాత్రలను వేయడం. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ ఫ్యాన్స్ దీంతో సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: