పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ బిజినెస్ మాన్ రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు జూలై 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన గతంలో చేసిన పలు కామెంట్స్, వ్యక్తిగత విషయాలు, వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన అసలు మల్టీ మిలియనీర్ గా ఎలా మారాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ విషయం తెలియాలంటే ఆయన గతంలోకి వెళ్లాల్సిందే. రాజ్ తండ్రి 45 సంవత్సరాల వయసులో పంజాబ్ నుండి లండన్ కు వలస వెళ్లారు. అక్కడ అయిన బస్ కండక్టర్ గా పని చేసేవారు. 18 సంవత్సరాల వయసులో కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయిన రాజ్ ఒక వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత నేపాల్ నుంచి పాప్మినా శాల్స్ కొని బ్రిటన్ లోని అన్ని ప్రధాన ఫ్యాషన్ హౌస్ లకు విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాడు. తరువాత తన తెలివితేటలను ఉపయోగించి దుబాయ్ లో డైమండ్ ట్రేడింగ్ లోకి అడుగు పెట్టాడు. 

యూకేలో రాజ్ కుంద్రా ట్రేడింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, స్టీల్, షేర్లు, మీడియా, స్పోర్ట్స్, గోల్డ్ ట్రేడింగ్ లలో పనిచేస్తున్న 10 కంపెనీలలో వాటా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 2004 నాటికి ఆయన 198వ ధనిక బ్రిటిష్ ఏషియన్ గా నిలిచాడు. ఆ తర్వాత బాలీవుడ్ తో పరిచయాలు పెరగడంతో సినిమా నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీంతో సెలబ్రిటీల పరిచయం కూడా జరిగింది. అందులో భాగంగానే 2007లో రాజ్ శిల్పాశెట్టి ని కలుసుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో రాజ్ తన మొదటి భార్య కవితకు విడాకులు ఇచ్చి శిల్పను పెళ్ళాడాడు. అనంతరం ఈ జంట రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ లో పెట్టుబడులు పెట్టి సహ యజమానులు అయ్యారు. ఇలా రాజ్ జర్నీ బస్ కండక్టర్ కొడుకు నుంచి మల్టీ మిలియనీర్ గా ఎదిగే వరకూ కొనసాగింది. కానీ ఆయన జీవితంలో పెద్ద పెద్ద స్కామ్ కూడా ఉన్నాయి. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఇప్పుడు అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. వెబ్ సిరీస్ లలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఆర్టిస్టులతో అగ్రిమెంట్లు చేయించుకుని వారితో న్యూడ్, సెమీ న్యూడ్ సినిమాలు తీసి, యాప్ లో అప్లోడ్ చేసి భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్ట్ ముంబైలోని ఓ బిల్డింగ్ లో పోర్న్ చిత్రాలు తీసే ముఠా ముంబై పోలీసులకు పట్టుబడింది. అందులో నటి, మోడల్ గెహనా వశిష్ట, రోవా ఖాన్ కూడా ఉన్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ యూకేకు సంబంధించినది కావడం, దానికి హెడ్ గా గతంలో రాజ్ వద్ద పని చేసిన ఉమేష్ కామత్ ఉండడంతో ఈ కేసు అనూహ్యంగా రాజ్ కుంద్రా అరెస్ట్ వరకు సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: