సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో శృంగార తార ఎవరు అనే ప్రశ్న రాగానే... టక్కున షకీలా అని చెప్పేస్తారు. ఎందుకంటే నటి షకీలా... హాట్ సీన్లతో పరిశ్రమలో అంతా ఫేమస్ అయ్యింది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన షకీలా... ఆ తర్వాత శృంగార పాత్రల్లో ఎక్కువగా నటించింది. నటి షకీలా ఎక్కువగా మలయాళం సినిమాల్లోనే శృంగార సినిమాల్లో నటించింది. తమిళంలో వచ్చిన ప్లే గర్ల్స్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమ లోకి షకీలా ఎంట్రీ ఇచ్చింది. చేసిన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది నటి షకీలా. 

ఇప్పటివరకు షకీలా 110 సినిమాల్లో నటించింది. అయితే 2003 సంవత్సరం నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల... శృంగార పాత్రలను చేయడం మానేసింది  షకీలా. శృంగార సినిమాలు మానేసి నా నటి షకీలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు  పోషించింది. తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది షకీలా.ఇక ఇప్పుడు షకీలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా... "ఆహా" తరహాలో ఓ ఓటిటీ ఫ్లాట్ ఫాం ను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. తన డ్యూటీ లో సినిమాలు రిలీజ్ చేయమని కూడా కొంతమంది నిర్మాతలకు షకీలా ఆఫర్ కూడా ఇచ్చింది.

 ఈ నేపథ్యంలోనే షకీలా తన పాత రోజులు గుర్తు చేసుకుంది. గతంలో సినిమాలు రిలీజ్ చేసే ముందు సెన్సార్ బోర్డు కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు అని తెలిపింది. తన సినిమా విడుదల కోసం సెన్సార్ బోర్డు చుట్టూ తిరిగి ఎన్ని ప్రయత్నాలు చేసిన సెన్సార్ ఇవ్వలేదని ఆ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి.. చాలా సార్లు ఏడిచానని చెప్పుకొచ్చింది షకీలా. ఈ విషయాలు చెప్పుకుంటే సిగ్గు చేటు అని చెప్పిన షకీలా.. చివరకు ఏమి చేయాలక డిజిటల్ వేదికగా తమ సినిమాలు విడుదల చేశామని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురు కాకూడదనే.. ఓటిటీ ఫ్లాట్ ఫాం ను తీసుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: