'మా' అసోసియేషన్ ఎన్నికల్లో ప్రతిసారి కంటే ఈసారి కొంచెం వేడి ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే చాలా వాడివేడిగా ప్రసంగాలు జరుగుతున్నాయి. మొదట ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించడంతో యునానిమస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అంతలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా బరిలో ఉన్నట్టు ప్రకటించడంతో వీరిద్దరి మధ్య పోరు గట్టిగా ఉంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


కానీ ఇంతలోనే రాజశేఖర్ సతీమణి జీవిత కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించడంతో త్రిముఖ పోరు తప్పదు అని భావించారు. వీరితో పాటే హేమ,  సీవీఎల్‌ నరసింహారావు కూడా బరిలో నిలిచారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ , రాజశేఖర్ జీవిత తమ మద్దతుదారులతో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. తాజాగా మంచు విష్ణు కూడా 'మా' ఎలక్షన్ విషయమై ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఈ హీరో  ఆసక్తికరమైన విషయాలు కూడా తెలిపాడు. కేవలం 'మా' బిల్డింగ్ మాత్రమే తన ఆశయం కాదని ,ఇందులో ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించడమే నా ఎజెండా అని తెలిపాడు. దీనితోపాటు  'మా' బిల్డింగ్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపాడు.


 కరోనా సమయంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కార్మికులకు ఎంతో సహాయం చేశాడు అని విష్ణు పేర్కొన్నాడు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం గొప్ప విషయం కానీ దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా విష్ణు పేర్కొన్నాడు. మనకు అండగా ఉన్న వారిని ఎలా ఆదుకోవాలి అనేది తన ఎజెండా అని పేర్కొన్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండవలసింది అని నేను చేసిన సహాయం వల్ల ఎప్పుడు బయట తిరుగుతున్నారు . అండర్ వేర్ తో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు వెళ్లి సర్ది చెప్పి బయటకు తీసుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: