బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు జూలై 19న అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రా పలువురు నటీనటులు, మరియు ఇతరులతో అశ్లీల చిత్రాలు తెరకెక్కించే వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ జరిపి అతన్ని అరెస్టు చేశారు. అయితే రోజురోజుకు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు నటీనటులు అశ్లీల‌ చిత్రాల కోసం రాజ్ కుంద్రా తమను కూడా సంప్రదించారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటి పూనం పాండే త‌న‌ను రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కోసం సంప్రదించాలని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ రాజ్ కుంద్రా తనను హాట్ షాట్స్ అనే యాప్ కోసం అశ్లీల చిత్రాలు చేయాలని సంప్రదించినట్టు ఆరోపించింది. 

యూట్యూబ‌ర్  పునీత్ కౌర్ త‌న యాప్ కోసం అశ్లీల చిత్రాలు చేయాలని రాజ్ కుంద్రా తనను కోరినట్టు తెలిసింది. అయితే సోషల్ మీడియా ద్వారా తనకు రాజ్ కుంద్రా నుండి ఈ మెసేజ్ లు వచ్చాయని...కానీ తాను రాజ్ కుంద్రా అకౌంట్ హ్యాక్ అయినట్లు తాను భావించినట్టు తెలిపింది. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వ‌డంతో అకౌంట్ హ్యాక్ కాలేదని నిజంగానే తనకు మెసేజ్ చేసినట్టు గుర్తించింది. ఇక రాజ్ కుంద్రా పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతడితో పాటు అతడి భార్య నటి శిల్పాశెట్టి పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు రాజ్ కుమార్ రాజ్ కుంద్రా గతంలో చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

సెక్స్ చేయడం కంటే అశ్లీల చిత్రాలు తెరకెక్కించడం తప్పుకాదు అని భావిస్తూ 2012లోనే రాజ్ కుంద్రా ఓ ట్వీట్ చేశారు. అయితే అప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ ట్వీట్ పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ తాజాగా అత‌డు అరెస్ట్ అవ్వ‌డంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. అంతే కాకుండా అతడు గత పదేళ్ల నుండి ఈ వ్యాపారం చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఇక రాజ్ కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ ఎన్నో వివాదాలు రాకుండా చిక్కుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ ల ఆరోపణలను కూడా రాజ్ కుంద్రా ఎదుర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: