టాలీవూడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత ఛాలెంజ్ గా తీసుకోని రూపొందిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.

సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తోన్న సంగతి అందరికి తెలిసిన విదితమే. కాగా.. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం మాత్రం యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అయితే ఈ పాటను అతడు పాడడంతో పటు డాన్స్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక అనిరుధ్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం అందరికి తెల్సిన విదితమే.

అయితే మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు పాటలు రాస్తాడు, పాడతాడు, డాన్స్ చేస్తాడు అనిరుధ్. ఇక ఆ మధ్య వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను అలానే డిజైన్ చేశారు. ఆ తరువాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పాటకు కూడా తానే ఓ వీడియో సాంగ్ ను డిజైన్ చేసుకొని పిక్చరైజ్ చేశాడు అనిరుద్. ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ సాంగ్ కోసం అతడిని తీసుకున్నారని సమాచారం. అయితే ఈ సాంగ్ తో అనిరుధ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తుందని అందరి భావిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’పై బజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అనిరుధ్ తో స్పెషల్ సాంగ్ మరింత బజ్ తీసుకొస్తుందని అనుకుంటున్నారు. అంతేకాక.. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: