చిరుత సినిమాతో రాంచరణ్ గ్రాండ్ గా సినిమా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాంచరణ్ మొదటి సినిమాను పూరిజగన్నాధ్ డైరెక్ట్ చేసాడు. చిరుత సినిమాతో రాంచరణ్ మాస్ గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో యాక్టింగ్ తోనే కాకుండా డాన్స్ పరంగా కూడా చరణ్ నిరూపించుకున్నాడు. చిరంజీవి బాక్గ్రౌండ్ తో వచ్చిన చరణ్ మొదటి సినిమాతో  మంచి విజయం సాధించాడు.ఆ తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో నటించాడు. ఆ సిసంతోషం నిమా అప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బద్ధలుకొట్టింది.40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సుమారు 80 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.అప్పటి వరకు ఈ స్టార్ హీరో సాధించలేనన్ని కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. పునర్జన్మల కాన్సెప్ట్ తో  వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. రాంచరణ్ తన రెండవ సినిమాతోనే స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు. అప్పటి నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగా తనకు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది.2011లో వచ్చిన దూకుడు సినిమా మగధీర రికార్డ్స్ బద్దలు కొట్టింది. మగధీర తరువాత రాంచరణ్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఆరంజ్ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్యవహారించాడు.ఈ సినిమా అనుకున్న అంచనాలు  అందుకోలేదు. నాగబాబు  ఈ సినిమా కోసం  చాలా  ఖర్చుపెట్టాడు. కానీ నిర్మాతకు ఆ సినిమా నష్టాలనే మిగిల్చింది. తరువాత రాంచరణ్ నటిచ్చిన సినిమాలు హిట్ అయిన  మగధీర స్థాయిని అందుకోలేదు. తరువాత రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన  రంగస్థలం సినిమా అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి  దర్శకత్వం లో rrr సినిమా చేస్తున్నాడు సుమారు 400కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో నిర్మాతగా ఉండటమే కాకుండా ఆసినిమాలో  ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత  శంకర్ డైరెక్షన్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి నిర్మాత  దిల్ రాజు. ఇదిలా ఉంటే శంకర్  సినిమాకు రాంచరణ్ కి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారంట. సుమారు 90కోట్ల వరకు ఎటువంటి పర్ సెంటేజ్ లేకుండా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాను 200కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: