సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కొంతమందికి నటన మీద ఆసక్తి ఉంటే , మరి కొంతమంది కొన్ని కొన్ని చిత్రాలను చూసి, ఆ కథలకు బాగా ఇన్స్పైర్ అయ్యి , సినీ ఇండస్ట్రీలోకి అడుగు వేస్తూ ఉంటారు. అలా సినిమాలను చూసి ఇన్స్పయిర్ అయ్యి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , స్టార్ డైరెక్టర్ లుగా ఎదిగిన ఎంతోమంది దర్శకులలో కోడి రామకృష్ణ కూడా ఒకరు. ఈయన మొదట సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం ఒక సినిమా అట. ఆ సినిమాను చూసి బాగా ఇన్స్పైర్ అయి , తను కూడా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్షతోనే, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. ఇక ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం..

సినిమా ఏదో కాదు తాత మనవడు. 1972వ సంవత్సరంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఇది. ఇక ఇందులో ప్రముఖ నటి అలాగే నిర్మాతగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల హీరోయిన్ గా నటించగా , ఇక ఈమె కు జోడీగా ప్రముఖ హాస్యనటుడు రాజబాబు హీరోగా నటించారు. అంతేకాదు రాజబాబుకు హీరోగా ఇది మొదటి చిత్రం. ఇక ఈ చిత్రంలో తాత మనవళ్ళ మధ్య సాగే సన్నివేశాలు కంటతడి కూడా తెప్పిస్తాయి.తాతయ్యగా ఎస్.వి.రంగారావు నటించగా , మనవడిగా రాజబాబు నటించారు . అంతే కాదు ఇందులో కైకాల, సత్యనారాయణ ,అంజలీదేవి , పొట్టి వీరయ్య వంటి ప్రముఖులు కూడా నటించడం విశేషం.

ఇక ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది. ఇక దాదాపు 25 వారాలపాటు కొనసాగి, కలెక్షన్స్ సునామి సృష్టించింది ఈ సినిమా. ఇక అలా ఈ చిత్రం విడుదల అయిన రోజు కోడి రామకృష్ణమూవీ ని చూశారు. ఇక ఇన్స్పైర్ అయ్యి పట్టుబట్టి దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. మొదటిసారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: