ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఒక హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మొదట రేడియోలో పని చేసి, ఆ తరువాత బుల్లితెరపై కూడా నటించాడు. ఇక అక్కడ మంచి పాపులారిటీని అందుకొని , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ప్రకాశం జిల్లాలోని కొమ్మునేని వారి పల్లెలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద మక్కువ ఎక్కువ ఉండడంతో ప్రజానాట్యమండలి తరఫున ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఎన్నో నాటకాలు కూడా వేసేవారు. ఇక నాటకాలలో కూడా ఆయన కేవలం హాస్య పాత్రలను మాత్రమే పోషించడం గమనార్హం.


అంతేకాదు స్క్రిప్టులు కూడా రాసేవాడు. ఇక మొదటి సారి అనగనగా ఒక శోభ అనే ధారావాహికకు కథ రాశాడు. ఇక రూ.6.50 పెట్టుబడితో ఈ సీరియల్ ను నిర్మించగా, అది ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆనందోబ్రహ్మ అనే ఒక సీరియల్ కు కథ కూడా రాయడం జరిగింది. ఇక ఈ సీరియల్ బాగా విజయాన్ని అందుకోవడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇక ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ సమావేశమయ్యారు. అక్కడికి ఈయన కూడా వెళ్ళారు.

అయితే కొంతమంది ప్రముఖుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో చిరంజీవి ..ఎవరైనా మంచి జోక్స్ చెప్పే వారుంటే , వినిపించండి అని అన్నారు. అప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ ఛాన్స్ ను ఉపయోగించుకొని , తన జోక్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు.అక్కడ ప్రముఖ దర్శకుడు జంధ్యాల కంట్లో పడ్డాడు. ఇక ఆయన దర్శకత్వం వహించిన "జయంబు నిశ్చయంబురా" సినిమాలో కమెడియన్ పాత్ర ఇచ్చి,  సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి కారణం అయ్యాడు. అలా ప్రముఖ దర్శకుడు జంధ్యాల సహాయంతో సినీ ఇండస్ట్రీలోకి, హాస్యనటుడిగా అడుగుపెట్టాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇక అలా తన నటనతో అందరిని మెప్పించి, హాస్యంతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: