సాధారణంగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే మన స్టార్ హీరోలకు భారతదేశం అంతటా మంచి క్రేజ్ ఉండాలి. అప్పుడే వారు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అర్హులు అవుతారు. అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం కలగవచ్చు. హాలీవుడ్ కూడా ఒక సినీ ఇండస్ట్రీనే కదా..!  అక్కడికి వెళ్ళడానికి కేవలం నటన వస్తే సరిపోతుంది. మరి భారతదేశం అంతటా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు కదా..! అని.. ఇ.ది నిజమే..! నటనలో మంచి ప్రావీణ్యం పొందితే, తప్పకుండా హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వవచ్చు. కాకపోతే మన హీరోలు ఏం చేస్తున్నారు అంటే, దేశమంతటా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే, హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు.

ఇక ఇప్పట్లో అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. తర్వాత ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని,  అవకాశం వస్తే తప్పకుండా వెళ్దాం అని కూడా పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే మన వాళ్ళు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు , అప్పట్లోనే అది కూడా ఒక కమెడియన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ మంచి గుర్తింపు పొందడంతో పాటు అవార్డు కూడా గెలుచుకున్నాడు.

ఆయనెవరో కాదు ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన రాజనాల. రాజనాల మొదట ఉపాధ్యాయుడుగా పనిచేసి,  ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈయన తన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది ప్రముఖులను గౌరవంగా సత్కరించేవారు కూడా. ఇక ఈయన  1960లో  మాయా ది మెగ్నీషిమెంట్" సినిమా తో  హాలీవుడ్ లోకి అరంగేట్రం చేసి మంచి సక్సెస్ ఫుల్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. అంతేకాదు మొట్టమొదటి హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కమెడియన్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజనాల.


మరింత సమాచారం తెలుసుకోండి: