డిజిటల్ ప్లాట్‌ఫాంల కారణంగా సినీ ప్రేమికులకు సబ్ టైటిల్స్ ద్వారా ఇతర భాషల చిత్రాలను చూడటానికి ఒక సువర్ణావకాశం లభించింది అనే చెప్పాలి. భాష అర్థం కాదనే అవరోధం ఇప్పుడు లేదు. ప్రేక్షకులు డిజిటల్ స్పేస్ ద్వారా అంతర్జాతీయ చిత్రాలను కూడా చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులేమీ దీనికి మినహాయింపు కాదు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5 వంటి ఓటిటి ప్లాట్ ఫామ్ ల ద్వారా ఇతర భాషల చిత్రాలను కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ధనుష్ హీరోగా నటించిన "కర్ణన్" చిత్రం రీమేక్ గురించి చర్చ నడుస్తోంది. సడన్ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే దానికి కారణం వెంకటేష్ "నారప్ప". మీరు విన్నది నిజమే. ధనుష్ తమిళ బ్లాక్ బస్టర్ "అసురన్"కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే. వెంకటేష్ హీరోగా నటించిన "నారప్ప" చిత్రం జూలై 20న ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ బాగానే నటించినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. తమిళంలో ధనుష్ నటనను, తెలుగులో వెంకటేష్ నటనను పోల్చుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. "అసురన్"లో ధనుష్ నటనకు నేషనల్ అవార్డు లభించింది. అయితే వెంకీ కూడా బాగా చేశాడు. కానీ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదన్నది నెటిజన్ల వాదన.

ఈ నేపథ్యంలో ధనుష్ సూపర్ హిట్ మూవీ "కర్ణన్" రీమేక్ గురించి చర్చించుకుంటున్నారు. సాధారణంగా కొన్ని సినిమాలను అలాగే ఎవర్ గ్రీన్ గా ఉంచాలి. కానీ కొంతమంది రీమేక్ పేరుతో వాటిని చెడగొడుతున్నారు. అయితే రీమేక్ లలో మాత్రం సోల్ మిస్ అవుతోంది. "కర్ణన్" కూడా త్వరలో తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ చిత్రం ఛాలెంజింగ్ గా ఉన్నందున రీమేక్ చేయవద్దని టాలీవుడ్‌ను కోలీవుడ్ సినీ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటేష్ అంటే సీనియర్ హీరో కాబట్టి "నారప్ప"ను హ్యాండిల్ చేయగలిగాడు. కానీ యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ "కర్ణన్" పాత్రలో నటించబోతున్నాడు. దీంతో "కర్ణన్"ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్ కు సోషల్ మీడియాలో ట్రోల్స్, రిక్వెస్ట్స్ లతో పాటు హెచ్చరికలు కూడా వస్తున్నాయి. మరి ఇటువంటి క్లాసిక్‌ మూవీని తెరకెక్కించే ముందు మేకర్స్ మరోసారి ఆలోచించుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని తనను తాను నిరూపించుకుంటాడా ? లేదంటే మరోసారి పునరాలోచనలో పడతాడా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: