అంతకుముందు రెండు సినిమాల్లో నటించినా కూడా క్రేజ్ తెచ్చుకోని నిధి అగర్వాల్ మూడవ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి హాట్ ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. అయితే ఇస్మార్త్ హిట్ తెలుగులో కన్నా నిధ్కి తమిళంలో ఎక్కువ పాపులారిటీ అందేలా చేసింది. అక్కడ వరుస అవకాశాలతో నిధి అగర్వాల్ దుమ్ముదులిపేస్తుంది. ఇస్మార్ట్ బ్యూటీ కోసం కోలీవుడ్ లో గుడి కూడా కట్టారంటే అమ్మడికి అక్కడ ఏ రేంజ్ పాపులారిటీ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే కోలీవుడ్ లో నిధి అగర్వాల్ ఒక్కో సినిమాకు అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ అడుగుతుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచరం ప్రకారం తెలుగులో కోటి డిమాండ్ అమ్మడు కోలీవుడ్ లో మాత్రం కోటిన్నరన, రెండు కోట్ల దాకా తీసుకుంటుందని తెలుస్తుంది. నిధికి తమిళ తంబీలు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఆమెకు అక్కడ స్టార్ క్రేజ్ వచ్చింది. అమ్మడు కూడా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెమ్యునరేషన్ పెంచేసింది.

ఇక తెలుగులో నిధి అగర్వాల్ గల్ల అశోక్ తో ఒక సినిమా చేస్తుంది. దీనితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. హరి హర సినిమాతో తెలుగులో కూడా నిధి ఫేట్ మారుతుందని భావిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తెలుగులో బిజీ అవుతుందనుకున్న నిధి సడెన్ గా తమిళ బాట పట్టింది. ఇక ఇప్పుడు అమ్మడు తెలుగులో కూడా టాప్ పొజిషన్ లో ఉండాలని చూస్తుంది. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా నిధి ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని నిధి అగర్వాల్ రోజు రోజుకి తన పాపులారిటీ పెంచుకుంటుందని చెప్పొచ్చు. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: