అతడు ఓ ప్రముఖ సెలబ్రెటీ భర్త.. భార్య‌ సెలబ్రెటీ స్టేటస్ తో అతడు కూడా ఓ సెలబ్రిటీ గా ఎదిగాడు. అంతే కాకుండా వ్యాపారిగా దేశంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యాపారవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న అతను ప్రస్తుతం మాత్రం ఎన్నో నిందలు.. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కారణం ఆయ‌న చేసిన చీకటి వ్యాపారాలు అని స్పష్టంగా కనిపిస్తోంది. అత‌నెవ‌రో కాదు నీలి చిత్రాల నిర్మాతగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కుంద్రా... ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త.  శిల్పాశెట్టి స్పిరుచువల్ యోగా అంటూ జనాలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తుంటే...రాజ్ మాత్రం ఐపీఎల్ బెట్టింగ్ లు.. బ్లూ ఫిలిమ్స్ అంటూ చీకటి వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. గతంలో రాజ్ కుంద్రా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అధిపతి గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయ‌న బెట్టింగ్ఆరోపణలు ఎదుర్కొన్నారు.

దాంతో రాజ్ పై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. చీటింగ్ వ్యాపారి అంటూ ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఇక ఇటీవల ముంబైలో ఓ అపార్ట్ మెంట్ లో బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరణ చేస్తూ ఉండగా పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేశారు. వారిని ఆరాతీయగా ప్రొడక్షన్ హౌస్ మూలాలు రాజ్ కంపెనీవి అని గుర్తించారు. ఆ కంపెనీ  యజమాని కామత్..రాజ్ కుంద్రాకు బినామీ. దాంతో పోలీసులు విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో రాజ్ ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. ఇక‌ రాజ్ కుంద్రా ను అరెస్ట్ చేసిన తర్వాత పలువురు మోడల్స్ నటీనటులు యూట్యూబర్ లు తెరపైకి వచ్చి తమకు కూడా రాజ్ కుంద్రా నుండి నీలి చిత్రాల్లో నటించేందుకు ఆఫర్లు ఇచ్చాయ‌ని చెబుతున్నారు.

ఇప్పటికే  ముగ్గురు నటీమణులు తెరపైకి వచ్చారు. వారిలో బాలీవుడ్ నటి పూనం పాండే కూడా ఒకరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్ కుంద్రా నీలి చిత్రాల సంపాదన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడి ఖాతా కు ప్ర‌తి రోజూ పది లక్షల వరకు నగదు నీలి చిత్రాల ద్వారా వ‌చ్చేద‌ని వెల్లడయింది. హాట్ హిట్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ సంపాదన వచ్చేదని పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ద్వారా కనీసం రాజ్ కుంద్రా రోజుకు ఐదు లక్షలు సంపాదించే వారని తెలుస్తోంది.  మరోవైపు హాట్ షాట్స్ అనే యాప్ కూడా రాజ్ కు చెందినది దీనిలో నటించేందుకు త‌న‌ను అడిగార‌ని ఓ యూట్యూబర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: