టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా నిన్నటి రోజున ఓటీటీ వేదికగా విడుదల అయిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో వెంకటేష్ నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసింది చిత్రబృందం. అయితే విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది.

తమిళం స్టార్ ధనుష్ నటించిన అసురన్ సినిమా తో పోల్చుకోకుంటే .... తెలుగు ప్రేక్షకులకు  మంచి అనుభూతిని ఇచ్చింది అని సినిమా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ నటన ఓ రేంజ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అటు  సినీ విమర్శకుల నోట కూడా పాజిటివ్ రేటింగ్ ను తెచ్చుకుంది నారప్ప సినిమా. ఈ సినిమాపై ఇప్పటికే చాలా మంది 85% పాజిటివ్ గానే ఉందంటూ మెచ్చుకున్నారు. అటు టాలీవుడ్ యాక్టర్ల నుంచి కూడా.... విశిష్ట స్పందన వస్తుంది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం నారప్ప సినిమా రావడంతో.... క్రేజ్ మరింత పెరిగింది. ఇక తాజాగా సినిమాపై అక్కినేని కోడలు సమంత తనదైన స్టైల్ లో స్పందించింది. బుధవారం రోజున అక్కినేని సమంత తన ఇన్ స్టాల్ గ్రామ్ స్టోరీస్ లో..నారప్ప సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పెట్టుకుంది. అంతేకాదు ఆ పోస్టర్ కు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుబాటి ని ఉద్దేశించి... వావ్... వ్ వ్.. వ్ వ్వ్ అంటూ ఆ పోస్టర్ క్యాప్షన్ పెట్టింది. నారప్ప సినిమా గురించి చాలా సింపుల్ గా తన రివ్యూ రేటింగ్ ను ఇచ్చేసింది. ఇక ప్రతి సినిమాకు సమంత ఇలాగే రివ్యూ ఇస్తుందన్న విషయం తెలిసిందే.  కాగా నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ చేయగా.. ఈ మూవీలో.. వెంకటేష్ సరసన ప్రియమణి నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: